స్టార్ హీరోకి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరోయిన్…!

0

కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కి చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన ‘కుట్టి స్టోరీ’ సాంగ్ కు ఆమె వయోలిన్ ప్లే చేస్తూ విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”జీవితం చాలా చిన్నది నన్బా.. ఎప్పుడూ ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్ డే విజయ్ సార్. మీ బర్త్డే రోజున ఓ చిన్న వీడియో” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి ఇప్పటి వరకు అద్భుతంగా యాక్ట్ చేయడం అందరూ చూశారు కానీ వయోలిన్ కూడా అద్భుతంగా ప్లే చేస్తుందని దీంతో తెలిసిపోయింది. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో దాదాపు 3 లక్షల మంది కీర్తి వీడియోని వీక్షించారు. విజయ్ – కీర్తి సురేష్ కాంబినేషన్ లో ‘భైరవ’ ‘సర్కార్’ సినిమాలు తెరకెక్కాయి. కాగా ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

‘Life is very short Nanba always be happy!’

Happy Birthday @actorvijay Sir!
Please Read Disclaimer