కప్పు టీ తాగితే ఆ కిక్కే వేరు కీర్తీ!

0

కప్పు కాఫీ లేదా టీ తాగితే మోక్షం వచ్చును అన్నాడో పెద్దాయన. కరోనా ప్రభంజనంలో వేడి వేడిగా కాఫీ టీలు తాగాలని ఎంకరేజ్ చేయడం చూశాం. గొంతులో వేడి జింజర్ ఛాయ్ లేదా వేడి వేడి కాఫీ పడాలన్నారు. మొత్తానికి ఏం ముంచుకొచ్చినా కాఫీ టీల విలువ పెరిగిందే కానీ తగ్గలేదు. నిజానికి ఆన్ లొకేషన్ షూటింగుల వేళ కూడా కాఫీ టీలకు కరువు లేకుండా చూస్తారు ప్రొడక్షన్ వాళ్లు. అలసి సొలసిన వారికి వెంటనే ఎనర్జీ తెచ్చే లిక్విడ్ ఇదే కాబట్టి అంత ప్రయారిటీ.

ఇదిగో ఇలా ఆన్ లొకేషన్ టీ కప్పుతో ప్రత్యక్షమైంది కీర్తి. చేతిలో వేడి వేడి టీ పెట్టేశారిలా. ఇక ఆ కప్పు తో ఎలా ఫోజిచ్చిందో చూశారుగా. అయినా కప్పు టీకే అంత కటింగ్ కొట్టేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. అన్నట్టు కీర్తి ఇప్పుడు ఏఏ సినిమాల్లో నటిస్తోంది అంటే.. కంబ్యాక్ లో మంచి ఆఫర్లే పట్టేసిందన్న చర్చ సాగుతోంది.

మహేష్ సరసన క్రేజీగా సర్కార్ వారి పాటలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన వేదాళం రీమేక్ లో కీర్తికే ఆఫర్ దక్కిందని ఇప్పటికే కథనాలొస్తున్నాయి. నితిన్ సరసన రంగ్ దేలోనూ నటిస్తోంది. అలాగే పలువురు యంగ్ హీరోల సరసన ఈ అమ్మడు ఆఫర్ దక్కించుకోనుంది. స్టార్ డైరెక్టర్లు అవకాశాలిస్తున్నారన్న సమాచారం ఉంది. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి.. అన్నథే.. సానీ కాయిధమ్.. ఇవన్నీ ఆఫర్లు తనకు ఉన్నాయి.