ఆఫర్ల వేటలో కేరళ కుట్టి ఐమా రోస్మీ

0

అందంతోపాటూ, అభినయం చూపించే అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలా… తెలుగు తెరకు పరిచయమయ్యే అవకాశాన్ని కరోనా వల్ల మిస్ చేసుకుంది కేరళ కుట్టి ఐమా సెబాస్టియన్.

ఈ బ్యూటీ నటించిన పడయోత్తం సినిమా… మళయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో… ఈమెకు స్టార్ డమ్ వచ్చింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటిలోనూ ఐమా అదరగొట్టింది. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ… తెలుగులో కూడా హీరోయిన్‌గా ఐమానే తీసుకున్నారు. తెలుగులో సుమంత్ హీరోగా నటిస్తున్నాడు. వినూ యజ్ఞ డైరెక్షన్‌లో ఈ సినిమా రావాల్సి ఉంది. కరోనా వల్ల బ్రేక్ పడింది.

పడయోత్తం కంటే ముందు ఐమా… మరో నాలుగు సినిమాలు చేసింది. 2016లో దూరం, జాకోబింటే స్వర్గరాజ్యం, హల్వా (Short Film) చేసింది. అలాగే 2017లో మంతిరివలలికల్ తల్లిర్కుంబొల్ చేసింది. తద్వారా నటనలో, అభినయం ప్రదర్శించడంలో ఆరితేరింది.

ఐమా మంచి డాన్సర్ కూడా. సినిమాల్లోకి రాకముందు… క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. 

దుబాయ్‌లో నివసించే ఈ బ్యూటీ… సినిమాలపై ఆసక్తితో… మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2018 జనవరి 4న కెవిన్ పాల్‌తో ఈ బ్యూటీకి వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. కరోనా వల్ల ఆగిపోయిన ఆఫర్లు తిరిగి ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఐమా… సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్న ఐమాకి… 4.5లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.