మూవ్ క్రీమ్ భంగిమ లో కేరళ భామ

0

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా బిజీగా మారింది. మధ్య లో కొన్ని ఫ్లాపులు పలకరించాయి కానీ ఈమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన ‘రాక్షసుడు’ అనుపమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. సినిమాల సంగతి ఇలా ఉంటే సోషల్ మీడియాలో అనుపమ చాలా బిజీ. ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను అప్డేటెడ్ గా ఉంచుతుంది.

ఈరోజు అనుపమ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు “ఆమె మనసు గజిబిజి గా ఉంది.. అయితే ఆమె కు ఈరోజు దాన్ని శుభ్రం చేసే ఆలోచన లేదు” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆమె మనసు ఎందుకు గజిబిజి గా ఉందో.. ఎందుకు క్లీన్ చేసే ఆలోచన లేదో మనకు తెలియదు. హాలిడే మూడ్ లో ఉన్నప్పుడు ఒక్కో సారి మనకు అలాగే అనిపిస్తుంది కదా. అనుపమకు కూడా అలాగే అనిపిస్తుందేమో మరి. ఇక ఫోటో విషయానికి వస్తే గ్రే కలర్ కుర్తా ధరించి ఫుల్ చిల్ అవుట్ మూడ్ లో పోజిచ్చింది. కళ్ళు మూసుకుని తన్మయత్వంలో కనిపిస్తోంది. మొహం పై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే ఒక ఆర్టిస్టిక్ పిక్ లా కనిపిస్తోంది. ఫేస్ లో గ్లో ఉంది.

ఈ ఫోటో కు స్పందనగా నెటిజన్లు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “అనూ.. ఆసమ్ పోజు”.. “సో నైస్ అనుపమ”.. “నీలో ఏదో స్పెషల్ ఉంది” .. “సూపర్ హాట్” అంటూ పొగడ్తలు కురిపించారు. ఒక నెటిజన్ కు ఈ పోజు నచ్చలేదేమో కానీ “నడుము నెప్పి ఉందా.. మూవ్ కావాలా?” అని అడిగారు. అనుపమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer