భారీ అప్డేట్.. గెట్ రెడీ కె.జీ.ఎఫ్ ఫ్యాన్స్!

0

సౌత్ సినిమాలను రీమేక్ చెయ్యడం బాలీవుడ్ వారికి మొదటి నుంచి అలవాటే కానీ సౌత్ డబ్బింగ్ ఫిలిమ్స్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తే హిందీలో ఆదరించడం చాలా తక్కువ. రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో తెరకేక్కిన ‘రోబో’ లాంటి కొన్ని సినిమాలు మాత్రం ఎక్సెప్షన్. కానీ ‘బాహుబలి 1 & 2’ తో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్ తో పాటుగా.. హిందీ ప్రేక్షకుల దృష్టి సౌత్ సినిమాలపై పడింది. ఈ సినిమాతో ప్రభాస్ కు భారీ క్రేజ్ దక్కింది. మరోవైపు కన్నడ సినిమా ‘కె.జీ.ఎఫ్’ కూడా ప్యాన్ ఇండియా సినిమాలాగా రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో ‘కె.జీ.ఎఫ్’ విజయంతో యష్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది.

ఒకవైపు ప్రభాస్ ‘సాహో’ పై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో.. యష్ నటించిన ‘కె.జీ.ఎఫ్: చాప్టర్ 2’ పై కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు. ఈ ఆసక్తికి తగ్గట్టే చాప్టర్ 2 ను మరింత భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ రానుందని వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో “కె.జీ ఎఫ్ చాప్టర్ 2 బిగ్ న్యూస్ కమింగ్ యువర్ వే టుమారో ఎట్ 11 am” అంటూ రాసి ఉంది. పోస్టర్ లో లో యష్ సిలౌట్ డిజైన్ లో పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు.

‘కె.జీ.ఎఫ్’ నిర్మాతలు ఈ అప్డేట్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ బిగ్ న్యూస్ ఏమై ఉండొచ్చు అంటూ చర్చలు మొదలయ్యాయి. కొందరు ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తుంటే..మరికొందరేమో ఇప్పుడే టీజర్ ఉండదని ఫస్ట్ లుక్ అయి ఉండొచ్చని అంటున్నారు. మరి ఫస్ట్ లుక్కా.. టీజరా లేదా మరొకటా తెలియాలంటే మనం రేపటివరకూ వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer