కేజీఎఫ్ 2: కోలార్ మాఫియా సింగం ఎవరు?

0

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన `కేజీఎఫ్ -చాప్టర్1` గత ఏడాది రిలీజై ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. కోలార్ బంగారు గనుల్లో మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రమిది. ఈ సినిమాతోనే యంగ్ హీరో యశ్- ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా పాపులరయ్యాయి.

ప్రస్తుతం `కేజీఎఫ్ – చాప్టర్ 2` సెట్స్ పై ఉంది. తొలి భాగాన్ని మించిన భారీ బడ్జెట్ ని పార్ట్ 2 కోసం కేటాయించామని నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రధాన ప్రతినాయకుడైన అధీరా లుక్ ని ఈనెల 29న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అధీరా ప్రీలుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో అధీరా వెనక్కి తిరిగి ఉన్న లుక్ కనిపిస్తోంది. పిడికిలి బిగించిన చేతి వేలికి ఒక లయన్ సింబల్ ఉన్న ఉంగరాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్ ఉత్కంఠను పెంచింది.

అసలు ఈ పాత్రలో నటిస్తున్నది ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తారని అప్పట్లో ప్రచారమైనా దానిని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అధీరా పాత్రలో కనిపించేది ఎవరు? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరైనా అది ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడే అయ్యి ఉంటారన్న స్పెక్యులేషన్ సాగుతోంది. తొలి భాగంలో విలన్ గరుడని ఒక రేంజ్ లో చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అధీరా పాత్రను అంతకు మించి చుపిస్తాడనడంలో సందేహం లేదు. ఓ పాత్రలో సంజయ్ దత్ కే ఛాన్సుందన్న అంచనా ఉంది. `కెజిఎఫ్ 2` ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
Please Read Disclaimer