కేజీఎఫ్ కు అయినా ఆ డేట్ సెట్ అయ్యేనా?

0

జులై 30 2020 తేదీ మొన్నటి వరకు మీడియాలో మారుమ్రోగి పోయింది. తెలుగు మీడియాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల మీడియాల్లో మరియు జాతీయ మీడియాలో కూడా ఆ తేదీ గురించి తెగ వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆ తేదీన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడమే. చాలా నెలలుగా ఆ తేదీకే ఆర్ఆర్ఆర్ చిత్రం వస్తుందనుకున్నారు. కాని సినిమా షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా క్వాలిటీ విషయం లో రాజీ పడవద్దనే ఉద్దేశ్యం తో ఏకంగా వచ్చే ఏడాది జనవరి 8కి ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేయడం జరిగింది.

జక్కన్న అండ్ టీం వదిలేసిన జులై 30వ తారీకును ఇప్పుడు యశ్ టీం ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో భర్తీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ 2 చిత్రాన్ని మే లేదా జూన్ లో విడుదల చేయాలని భావించారు. కాని బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా వారి డేట్లు కుదరక పోవడంతో షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యంగా నడుస్తుందట. దాంతో సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయలేక పోవచ్చు అంటూ ఇప్పటికే కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఎలాగూ మే లేదా జూన్ లో సినిమాను తీసుకు రాలేరు. కనుక ఆర్ఆర్ఆర్ సినిమా వదిలేసిన జులై 30కి అయినా కేజీఎఫ్ 2 ను తీసుకు వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే షూటింగ్ అప్పటి వరకు అయినా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం చేస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటి వరకు సినిమా ఎంత పూర్తి అయ్యిందనే విషయం పై ఎలాంటి క్లారిటీని యూనిట్ సభ్యులు ఇవ్వడం లేదు. దాంతో జులై 30వ తేదీ కి కూడా వచ్చే అవకాశాలు తక్కువే అంటూ కన్నడ పరిశ్రమ లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-