కేజీఎఫ్ 2 ముగిసిందా గడ్డం తీశాడు?

0

కన్నడ సినిమాల గురించి కేజీఎఫ్ కు ముందు వరకు ఎవరు పెద్దగా పట్టించుకునే వారే కాదు. కాని కేజీఎఫ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటిన ఉండి సౌత్ సినీ ప్రేక్షకులు అందరు ఇంకా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు ప్రేక్షకులు కూడా కన్నడ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. కన్నడ సినిమా కు ఇంతటి గుర్తింపు తెచ్చింది యశ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్నడ సినిమా మార్కెట్ ను ఎక్కడికో తీసుకు వెళ్లిన యశ్ కేజీఎఫ్ 2 తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

కేజీఎఫ్ చిత్రం కోసం గత మూడు సంవత్సరాలుగా యశ్ గడ్డం క్లీన్ షేవ్ చేయకుండా వస్తున్నాడు. ఇప్పటి వరకు యశ్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే ఫేస్ గుబురు గడ్డంతోనే అనడంలో సందేహం లేదు. మూడు సంవత్సరాల తర్వాత యశ్ గడ్డం తీశాడు. పూర్తిగా ట్రిమ్ చేయించుకున్నాడు. ఎట్టకేలకు గడ్డం చేయించుకున్న యశ్ కొత్త లుక్ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.

యశ్ గడ్డం తీసేయడం తో కేజీఎఫ్ 2 గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ పూర్తిగా గడ్డంతో కనిపించిన యశ్ రెండవ పార్ట్ లో కూడా గడ్డంతోనే నటించాడు. అయితే ఇప్పుడు గడ్డం తీసేయడంకు కారణం సినిమానేనా లేదంటే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది కనుక గడ్డం తీసేశాడా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. కేజీఎఫ్ 2 షూటింగ్ అప్ డేట్ కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో యశ్ గడ్డం తీసుకోవడం తో షూటింగ్ పూర్తి అయినట్లే అంటూ అంతా భావిస్తున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది చిత్ర యూనిట్ సభ్యులు చెప్పాలి. కేజీఎఫ్ 2 అప్ డేట్ కోసం తెగ ట్వీట్స్ పడుతున్నాయి. ఇదే సమయంలో యశ్ కొత్త లుక్ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న కేజీఎఫ్ స్టార్ యశ్ రెండవ పార్ట్ తో మరింత గా పాపులారిటీని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-