సూపర్ స్టార్.. యంగ్ టైగర్ ఎవరు ముందు?

0

సౌత్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్ల లిస్టులో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. ‘కె.జీ.ఎఫ్: చాప్టర్ 1’ సినిమాతో భారీ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కె.జీ.ఎఫ్: చాప్టర్ 2’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టాలీవుడ్ టాప్ స్టార్లతో ఉంటుందనే వార్తలు చాలా రోజుల నుండి వస్తున్నాయి.

కొంతకాలం క్రితం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రశాంత్ నెక్స్ట్ సినిమా ఉంటుందని.. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. మైత్రీ వారు కూడా ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని.. సమ్మర్ లో ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ సుంకర బ్యానర్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు అని ప్రచారం సాగుతోంది. మహేష్ ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ తో బిజీగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ నటించబోయే సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆ ప్రాజెక్ట్ ప్రశాంత్ తోనే ఉండొచ్చని సమాచారం.

అయితే ప్రశాంత్ నెక్స్ట్ సినిమా మహేష్ తోనా ఎన్టీఆర్ తోనా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇద్దరితో ప్రాజెక్టులు ఫైనలైజ్ అయ్యాయి అంటే ముందుగా ప్రశాంత్ సినిమా ఎవరితో ఉంటుందనేది చూడాలి. ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే మాత్రం వచ్చే ఏడాది జులై వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు అందుబాటులో ఉంటారు కానీ ప్రశాంత్ ‘కెజీఎఫ్ 2’ షూటింగ్ పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. మహేష్ అప్పటివరకూ వేచి చూస్తారా అనేది సందేహమే. త్వరలోనే ప్రశాంత్ నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer