కేజీఎఫ్ దర్శకుడి తో మహేష్ ఫిక్సేనా?

0

`కేజీఎఫ్` చిత్రంతో ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చాడు ప్రశాంత్ నీల్. అప్పటివరకూ కన్నడ రంగం వరకే అతడి పేరు సుపరిచితం. కేజీఎఫ్ రిలీజై సంచలన విజయం సాధించిన తర్వాత అతడి పేరు దేశమంతా అన్ని పరిశ్రమల్లో మార్మోగి పోయింది. ఇంతటి క్లాసిక్ స్టైల్లో అలాంటి మాస్ యాక్షన్ సినిమాని తెరకెక్కించిన ఘనత ప్రశాంత్ నీల్ కే దక్కింది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం లో కేజీఎఫ్ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు.

కేజీఎఫ్ చాప్టర్ 2 సెట్స్ పై ఉండగానే టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. మహేష్- ఎన్టీఆర్- ప్రభాస్ అంటూ ఇంపార్టెంట్ పేర్లు తెరపైకొచ్చాయి. వీళ్లందరికీ ప్రశాంత్ ఓకే అనే అన్నాడు. లైన్ కూడా వినిపించాడు. అయితే ఎవరూ ఓకే అనలేదు. వద్దు అనలేదు. ప్రాజెక్టు ను ఆన్ లోనే ఉంచారు. ఇంతకీ మహేష్ సంగతేంటి? ప్రశాంత్ నీల్ తో కన్ఫామ్ అయినట్టేనా? అంటే.. తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.

“ప్రశాంత్ కథ వినిపించాడు. కానీ ఇంకా ఏదీ ఖాయం అయి పోలేదు. ఏదో అయి పోయిందని అనుకోవద్దు. భవిష్యత్ లో కలిసి పని చేసేందుకు ఆస్కారం ఉంది“ అని అన్నారు. అన్నట్టు ఇదే ఇంటర్వ్యూలో పాన్ ఇండియా ప్రయత్నంపైనా మహేష్ ఓపెనయ్యారు. బహుశా .. కేజీఎఫ్ దర్శకుడు అలాంటి కథతో ఒప్పిస్తే వెంటనే పట్టాలెక్కే ఛాన్సుండొచ్చు అన్నమాట.
Please Read Disclaimer