మర్డర్ కేసులో ఇరుక్కున్న కేజీఎఫ్ బాయ్

0

శాండల్ వుడ్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో హీరో యష్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా దేశమంతటా పాపులర్ అయిపోయారు. కన్నడ సినిమా క్రేజ్ – మార్కెట్ ను పీక్స్ కు తీసుకువెళ్లిన సినిమాగా కేజీఎఫ్ రికార్డులకెక్కింది. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా బృందానికి చెందిన ఓ వ్యక్తి ఒక హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచాడు.

రఘు అనే వ్యక్తి కేజీఎఫ్ కోసం స్టంట్ మాన్ గా పనిచేశాడు. తాజాగా రఘు ఒక వ్యక్తిని చంపి అతని శరీరాన్ని కారుతో పాటు కాల్చివేసినట్టు తెలుస్తోంది. రఘు స్నేహితురాలు అయిన ఓ మహిళతో హత్యకు గురైన వ్యక్తి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడు ఆ మహిళతో తాను ఉన్న వీడియోలతో ఆమెను బెదరిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు మహిళ రఘుకు చెప్పగా రఘు… సిద్ధు అనే మరో స్నేహితుడితో కలిసి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని చంపేశారు.

ప్రస్తుతానికి ఆ మహిళతో పాటు రఘు – సిద్ధు రిమాండ్ లో ఉన్నారు. నిందితురాలిగా ఉన్న కేజీఎఫ్ స్టంట్ మ్యాన్ రఘు స్నేహితురాలి కథనం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి తనతో పాటు చాలా మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. ఇక రఘు కన్నడ సినిమా పరిశ్రమలో కేజీఎఫ్ తో పాటు పలు సినిమాలకు స్టంట్ మ్యాన్ గా పనిచేశాడు. ఇక ఇప్పుడు హత్య కేసులో చిక్కుకుని వార్తల్లో కెక్కాడు.
Please Read Disclaimer