ఆ పాన్ ఇండియా మూవీ ఓటిటి రిలీజ్.. అబద్దమేనట!

0

కన్నడ స్టార్ హీరో యశ్ ఒక్కసారిగా ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలోనే 200కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి సినిమాగా కేజీఎఫ్ రికార్డుల్లోకెక్కింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా సినీ అభిమానులు కేజీఎఫ్2 సినిమాకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలో రిలీజ్ అవుతుందని.. అంతేగాక కెజిఎఫ్ 2 సినిమా ఓటిటిలో విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. అయితే టీజర్ రిలీజ్ చేసే ఆలోచన లేదని సినిమా రిలీజ్ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని సహానిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల లేట్ అవుతుందని బయ్యర్లు కూడా నష్టపోతారని ఓటిటి విడుదలకు నిర్ణయించుకున్నట్లు పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలను కేజీఎఫ్ టీమ్ ఖండించి.. అలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా కనిపించనుండగా రావు రమేష్ రవీనాటండన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు.
Please Read Disclaimer