Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెపోటిజం స్టార్లకు `పే పెర్ వ్యూ` .. అంత సీనుందా?

నెపోటిజం స్టార్లకు `పే పెర్ వ్యూ` .. అంత సీనుందా?


ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అంటూ ఏటీటీతోనే పబ్బం గడిపేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. లఘు చిత్రాల తరహాలో సినిమాలు తీసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఓటీటీల్లో రిలీజ్ చేసి `పే పెర్ వ్యూ` విధానంలో వసూల్ చేస్తే తప్పేమిటి?

ఇదే ఆలోచన చేస్తున్నాయట ప్రముఖ ఓటీటీ కంపెనీలు. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై పే చేసి సినిమా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎంతవరకూ సక్సెసవుతుంది? అన్నది అటుంచితే ప్రస్తుతం జీ5లో రిలీజ్ కి వస్తున్న `కలీ పీలి`ని పే పెర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తున్నారట. షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్- అనన్య పాండే జంటగా మక్బూల్ ఖాన్ రూపొందించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదలవుతోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ పై నెపోటిజం స్టార్ అనన్య పాండే ప్రభావం చాలా ఎక్కువ పడడం కంగారు పెట్టింది.

ఇకపోతే ఈ మూవీని వీక్షించాలంటే చిన్న మొత్తంలో పేమెంట్ చేయాల్సి ఉంటుందని తెలిసింది. కానీ అంతగా క్రేజు లేని నెపోటిజం వ్యతిరేకత ఎదుర్కొంటున్న మూవీని డబ్బు చెల్లించి ఎవరు చూస్తారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏ ప్రభాస్ నో.. హృతిక్ రోషనో .. సల్మాన్ ఖాన్ అంటే చూస్తారు కానీ.. అప్ కం స్టార్లు నటించేవి ఈ విధానంలో సక్సెసవుతాయా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ అనే చెప్పాలి.