`ఖైదీ` కొత్తతరం మేకింగ్.. మహేష్ ప్రశంస

0

పాటలు- గ్లామర్ తళుకులు.. అందాల ఆరబోతతో అలరించే హీరోయిన్ కనిపించకుండా.. సినిమా అంతా హీరో ఒకే కాస్ట్యూమ్ తో నటించడం సినీ చరిత్రలోనే ఇప్పటి వరకూ లేదు. ఆ రూల్ ని బ్రేక్ చేస్తూ తెరపైకొచ్చిన చిత్రం `ఖైదీ`. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఈ దీపావళికి విజయ్ `విజిల్`తో పోటీపడుతూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచి ప్రేక్షకులు క్రిటిక్స్ మెప్పుతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది.

గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో రూల్ బ్రేకింగ్ టేకింగ్ తో తెరపైకొచ్చిన `ఖైదీ` గత కొంత కాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న హీరో కార్తీకి విజయాన్నిఅందించి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్య తనకు నచ్చిన చిత్రాలపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నమహేష్ తాజాగా కార్తీ నటించిన `ఖైదీ` చిత్రంపై ప్రసంశలు కురిపించారు.“ఖైదీ` ఓ న్యూఏజ్ ఫిల్మ్ మేకింగ్. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు- గ్రిప్పింగ్ స్క్రిప్ట్- కళ్లు చెదిరే నటన.. పైగా పాటలు లేకుండా ఆకట్టుకున్నారు. స్వాగతించాల్సిన ప్రయోగమిది“ అంటూ ప్రశంసించారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా పాటల్లేకుండా ఒకే కాస్ట్యూమ్ ఉన్న సినిమాలో మహేష్ నటిస్తారా? అంటే అది ఇంపాజిబుల్ ఇప్పటికి.

మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాములమ్మ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి.. హీరోయిన్గా రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో పోటీపడబోతోంది.
Please Read Disclaimer