దళపతి 64 తర్వాత ఖైదీ సీక్వెల్

0

కార్తీ నటించిన తాజా చిత్రం `ఖైదీ` క్రిటిక్స్ ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించే వసూళ్లు సాధించింది. హీరోయిన్ లేకుండా .. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా.. పూర్తిగా ఎమోషన్స్ పై ఆధారపడి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన సినిమాగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పనితనాన్ని ప్రశంసించని వాళ్లు లేరు.

అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. రిలీజ్ ముందు ఇంటర్వ్యూలో మీడియాతో ముచ్చటించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ .. సినిమా జయాపజయాలపైనే సీక్వెల్ తీయాలా వద్దా? అన్నది ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇప్పుడు ష్యూర్ షాట్ హిట్ అన్న టాక్ రావడంతో ఇక సీక్వెల్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఆ మేరకు లోకేష్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

అయితే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం దళపతి 64 తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే దళపతి విజయ్ తో అతడికి కమిట్ మెంట్ ఉంది. ఈ సినిమా పూర్తయిన అనంతరం మళ్లీ కార్తీతో ఖైదీ సీక్వెల్ పనుల్లో ఉంటాడట. విజయ్ నటించిన బిగిల్ తమిళంలో హిట్టయినా తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది. విజిల్ కంటే ఇక్కడ ఖైదీకే మంచి టాక్ రావడం విశేషం. తండ్రి కూతుళ్ల సెంటిమెంటుతో నైట్ ఎఫెక్ట్ లో తీసిన ఈ సినిమాకి దర్శకుడి పనితనం భేష్ అన్న ప్రశంసలు దక్కాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home