చిరు 152లో హీరోయిన్ క్లారిటీ

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా తర్వాత రూపొందే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ స్క్రిప్ట్ తో శివ సిద్ధంగా ఉన్నప్పటికీ కథ పరంగా కాస్త స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం చిరు అదే పని మీదున్నారు. త్వరలో కేరళకు ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం వెళ్తారని టాక్ ఉంది. ఇదిలా ఉండగా నిన్న ఈ మూవీ గురించి వచ్చిన ప్రచారంలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశం గురించి గట్టిగానే ప్రచారం జరిగింది.

కానీ అదంతా అబద్దమని కొరటాల శివ కొట్టిపారేసినట్టు ఫ్రెష్ అప్ డేట్. అసలు తను ఛాయస్ లో కూడా లేదని ఆల్రెడీ ఖైదీ నెంబర్ 150లో చేసింది కాబట్టి ఫ్రెష్ కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నట్టు చెప్పారట. కాజల్ వద్దకు అసలు ప్రతిపాదన కూడా వెళ్లలేదని క్లారిటీ ఇచ్చినట్టు వినికిడి. మరి ఎవరిని తీసుకుంటారు అంటే ఆ సస్పెన్స్ ఇంకొద్ది రోజులు ఇలాగే కొనసాగుతుంది. ఆగస్ట్ 22న చిరు బర్త్ డే రోజకి ఇది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే మెగా కాంపౌండ్ లీక్స్ ని బట్టి తెలుస్తోంది.

అదే నిజమైతే ఈ పాతిక రోజుల టైంలోనే హీరోయిన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నయనతార-అనుష్క పేర్లు వినిపించాయి కానీ వాళ్ళ డేట్స్ అంత సులభంగా దొరికేలా లేవు. మరోవైపు ఐశ్వర్య రాయ్ ని తీసుకుందామనే ఆలోచన చేసినా వ్యవహారం బాగా ఖరీదుగా మారడంతో ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలిసింది. కొరటాలకు ఐదో పెద్ద ఛాలెంజ్ గా మారిందని సన్నిహితుల మాట
Please Read Disclaimer