ఖైరియత్.. మనసును టచ్ చేస్తోందిగా

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చిచోరె’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమయం తక్కువే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా టీజర్ ట్రైలర్లకు ఇప్పటికే మంచి స్పందన దక్కింది. ఇక ‘చిచోరే’ నుంచి ‘ఫికర్ నాట్’.. ‘వో దిన్’ అంటూ సాగే రెండు పాటలను కూడా రీసెంట్ గా విడుదల చేశారు. తాజాగా ‘ఖైరియత్’ అనే మరో వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రీతమ్. ఖైరియత్ పాటకు సాహిత్యం అందించిన వారు అమితాబ్ భట్టాచార్య. శాడ్ మూడ్ లో సాగే ఈ పాటను ఆలాపించిన వారు అరిజిత్ సింగ్. ఇలాంటి ఫీల్ ఉన్న పాటలు అరిజిత్ సింగ్ కు భలే సూట్ అవుతాయి. ఈ పాటను కూడా తనదైన స్టైల్ లో అరిజిత్ ఎంతో టచింగ్ గా పాడడం జరిగింది. ‘ఖైరియత్ పూఛో కభీ తో కైఫియత్ పూఛో’ అంటూ సాగే లిరిక్స్.. అరిజిత్ మెలోడియస్ వాయిస్ శ్రోతలను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఇవన్నీ మెలోడీలను ఇష్టపడేవారికే లెండి. ‘ఓ సాకీ సాకీ రే’ బాపతు మ్యూజిక్ లవర్స్ కు ఇలాంటి స్లో సాంగ్ కనెక్ట్ కావడం కష్టమే.

ఏడుమంది కాలేజ్ ఫ్రెండ్స్ జీవితాలలో 1992 నుండి ఇప్పటి వరకూ ఏం జరిగింది అనే థీమ్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. కామెడీతో పాటుగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరిగా తెలుగు ‘ఏజెంట్ ఆత్రేయ’ నవీన్ పోలిశెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో వరుణ్ శర్మ.. ప్రతీక్ బబ్బర్.. తాహిర్ రాజ్ భాసిన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నడయడ్వాలా నిర్మిస్తున్నారు
Please Read Disclaimer