ఖుష్బూ పిలుపు.. మాయావికి వినపడిందా?

0

సీనియర్ నటి ఖుష్బూ రెండు పడవల పయనం గురించి తెలిసిందే. సినిమా- రాజకీయాలు వేటినీ విడిచిపెట్టకుండా దశాబ్ధాల పాటు కెరీర్ బండిని సాగిస్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ `అజ్ఞాతవాసి`లో నటించారు. ఆ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అటుపై ఎన్నికల వేళ పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఇక ఇప్పటికే ఎలక్షన్ స్టంట్ పూర్తయ్యింది కాబట్టి ఇకపై తిరిగి ముఖానికి రంగేసుకునేందుకు ఈ సీనియర్ నటి రెడీ అవుతున్నారు.

నటించే ముందు ఫ్యాన్స్ కి టచ్ లోకి వచ్చిన ఖుష్బూ తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలా వద్దా? అంటూ ఒపీనియన్ కోరారు. “నన్ను తిరిగి సినిమాల్లోకి రమ్మని అంటారా? క్రౌడ్ ని మిస్సవ్వాలని అనుకోవడం లేదు. ఆసక్తి రేకెత్తించే పాత్రలు అయితేనే చేస్తాను“ అంటూ ట్వీట్ చేయడంతో దానికి అభిమానుల నుంచి రిప్లయ్ వచ్చింది. ఖుష్బూ తిరిగి సినిమాల్లోకి రావాలని మెజారిటీ అభిమానులు కోరారు.

సోషల్ మీడియాలో ఖుష్బూ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎలానూ ఆమె ఆలోచన ఇప్పటికే కోలీవుడ్ – టాలీవుడ్ డైరెక్టర్లకు నిర్మాతలకు చేరిపోయింది కాబట్టి అందుకు తగ్గట్టే అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. అన్నట్టు అజ్ఞాతవాసి తర్వాత అల్లు అర్జున్ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ కి ఆ సౌండ్ వినపడిందా? లేదా? ఇప్పటికే టబు లాంటి సీనియర్ నటిని బన్ని సినిమాకి మాటల మాయావి ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఖుష్బూ కి ఈసారికి ఛాన్స్ లేదేమో?
Please Read Disclaimer