డ్యూయట్ సాంగ్ చేయమంటే చెంప పగులుద్దన్నాడట

0

హీరోలు.. హీరోయిన్స్ కూడా మామూలు మనుషులే. వారికి.. కొన్ని ఆశలు..కోరికలు ఉంటాయి. సగటు ప్రేక్షకుడికి ఎలా అయితే కొన్ని క్రష్ లు ఉంటాయో.. హీరోయిన్లకు కూడా ఉంటాయి. అయితే.. అలాంటి విషయాల్ని ఓపెన్ గా చెప్పే దమ్ము.. ధైర్యం చాలామందికి ఉండదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు టాలీవుడ్.. కోలీవుడ్ ను ఏలేసిన నాటి కలల రాణి ఖుష్బూ తాజాగా ఇచ్చిన ఒక షోలో ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

తనకు హీరో అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయనతో కలిసి తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హీరోయిన్ గా చేసే వేళలో.. ఆయనతో కలిసి ఒక డ్యూయట్ చేయాలన్న కోరిక ఉండేదట. ఒకసారి అమితాబ్ చెన్నైకి వచ్చినప్పుడు ఆయన్నుఖుష్బూ కలిశారట. ఆ టైంలో హీరోయిన్ గా ఆమెకు చాలా క్రేజ్ ఉన్న టైం.

తనతో ఏదైనా సినిమాలో డ్యూయట్ చేయాలన్న కోరికను అమితాబ్ కు చెప్పారట. దీనికి రియాక్ట్ అయిన ఆయన.. తన చేయి చూపిస్తూ.. ఇంకోసారి అలా అడిగితే ఈ చేయి నీ ముఖం మీద ఉంటుందని చెప్పారట. ఎందుకంటే.. చిన్నప్పుడు ఒక కాలి మీద నువ్వు కూర్చుంటే మరో కాలి మీద శ్వేత (అమితాబ్ కుమార్తె) కూర్చొనేవారు.. నిన్ను కూతురితో సమానంగా చూసుకున్నా.. నీతో సాంగ్ చేయటం కుదరదని తేల్చేసిన వైనాన్ని చెప్పారు. ఇలా అమితాబ్ తేల్చి చెప్పేయటంతో బిగ్ బితో డ్యూయట్ సాంగ్ చేయాలన్న తన కల కరిగిపోయినట్లు చెప్పారు ఖుష్బూ. ఇలాంటి విషయాల్ని షేర్ చేయటానికి సైతం ధైర్యం ఉండాల్సిందే సుమా.
Please Read Disclaimer