ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం లేడీ స్టార్ పడిగాపులు

0

హీరోలకు అభిమానులు ఉండటం అనేది చాలా కామన్. అయితే ఒక హీరో కు మరో హీరో లేదంటే హీరోయిన్ ఫ్యాన్ గా ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఆ హీరోకు ఈ హీరోయిన్ అభిమాని అంటా అంటూ వార్తలు చదువుకుంటూ ఉంటాం. కాని ఎన్టీఆర్ ను నిన్నటి తరం హీరోయిన్ ఖుష్బు ఒక అడుగు ముందుకు వేసి మరీ అభిమానిస్తుంది. ఒక సాదారణ ఫ్యాన్ ఎంతగా అయితే హీరో ఆటోగ్రాఫ్ కోసం.. అతడితో సెల్ఫీ కోసం ఎదురు చూస్తారో అలాగే ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం కూడా ఖుష్బు ఎదురు చూస్తోందట.

తాజాగా ఖుష్బు మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చింది. ఒకసారి ఎన్టీఆర్ బోజనంకు పిలిస్తే వెళ్లాలని.. ఆయన ఇంట్లో ఆయనతో కలిసి బోజనం చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంది. అదే సమయంలో ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకుని దాన్ని భద్రంగా లాకర్ లో దాచుకోవాలనుకుంటున్నట్లుగా ఖుష్బు చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్ని చూశాను. ఎన్టీఆర్ ఎమోషన్ సీన్స్ చేస్తే నేను ఏడ్చేస్తాను అంది. ఎన్టీఆర్ నటన మరియు డాన్స్ లకు నేను పిచ్చి అభిమానిని. ఎన్టీఆర్ గొప్ప నటుడు అంటూ ఖుష్బు చెప్పుకొచ్చింది. తమిళ హీరో అరవింద్ స్వామి అంటే కూడా ఖుష్బు కు చాలా ఇష్టమట. గతంలో ఒక సినిమా చూసిన తర్వాత అరవింద్ స్వామికి అభిమానిని అయ్యాను. ఆ సమయంలో ఫ్యాన్ ను ఆటోగ్రాఫ్ కావాలంటూ అరవింద్ స్వామి వద్ద కు నేను వెళ్తే ఆయన మొదట నమ్మలేదు. మా అన్నయ్య ద్వారా అరవింద్ స్వామిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అంటూ గత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.
Please Read Disclaimer