అది వల్గర్ సీన్ కాదు అందుకే చేశా

0

ప్రస్తుతం బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్ గా కియారా అద్వానీ మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు సిద్దం అవుతున్న ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిన కియారా అద్వానీ అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తుంది. బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా రెచ్చి పోతున్న కియారా అద్వానీ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

సినిమాలతో పాటు కియారా అద్వానీ వెబ్ సిరీస్ లను కూడా చేసింది. లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ పాత్ర మరీ బోల్డ్ పాత్రలో నటించింది. అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియారా అద్వానీ హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయిగా కూడా కనిపించింది. ఆ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ పాత్రతో నటిగా కూడా మంచి పేరును సంపాదించుకుంది. అయితే అలాంటి సీన్స్ చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఆ పాత్రపై మరియు ఆ సీన్ పై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ పాత్ర అమాయకత్వంతో కూడిన అమ్మాయి అవ్వడం వల్ల అందరికి సానుభూతి ఉంటుంది. అందుకే హస్త ప్రయోగం సీన్ లో ఎక్కువ మంది అశ్లీలత చూడరు. ఆ సీన్ లో ఆమె పరిస్థితిని మెచ్యూర్డ్ గా జనాలు ఆలోచిస్తున్నారు. అందుకే ఎక్కువగా ఆ పాత్ర గురించి సీన్ గురించి నాపై విమర్శలు రాలేదు. ఒక వేళ ఆ సీన్ నచ్చకుంటే ఇప్పటికే నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మరియు మీమ్స్ వచ్చేవి. కాని అవేవి రాకపోవడంతో ప్రేక్షకులు ఆ సీన్ ను వల్గర్ గా కాకుండా స్క్రీన్ ప్లేకు అవసరం అయిన సీన్ గా తీసుకున్నారు. అందుకే విమర్శలు రాలేదు. నాకు చేయడానికి ముందు ఆ సీన్ వల్గర్ గా అనిపించలేదు.. దర్శకుడు కరణ్ చాలా బాగా ఆ సీన్ ను చిత్రీకరించాడు. అందుకే నేను చేసేందుకు ఒప్పుకున్నాను అంటూ కియారా చెప్పుకొచ్చింది.