మెగా మూవీ ని తిరష్కరించిందా?

0

గద్దలకొండ గణేష్ అంటూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో ఒక బాక్సింగ్ నేపథ్యం లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మించబోతున్నాడు. పూర్తి స్థాయి నిర్మాతగా బాబీకి ఇదే మొదటి సినిమా అవ్వడం వల్ల అందరు కూడా ఈ సినిమా పై ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా లో హీరోయిన్ విషయ మై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

మొదట ఈ చిత్రం కోసం కైరా అద్వానీని సంప్రదించారు. ఆమె ఓకే చెప్పింది కాని ఇతర సినిమాలకు ముందే డేట్లు ఇచ్చిన కారణంగా కొంత సమయం కావాలని కోరిందట. అందుకే నిర్మాతలు ఓకే అన్నారని.. కాని హీరో వరుణ్ తేజ్ మాత్రం ఆమె కోసం తాను వెయిట్ చేయంటూ నిర్మాతలతో విభేదించాడంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మెగా మూవీ కి వెంటనే డేట్లు అడిగిన కారణంగా కైరా అద్వానీ ఆఫర్ ను తిరష్కరించిందని తెలుస్తోంది.

కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అక్కడ బిజీగా ఉన్నా కూడా సౌత్ లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది. కాని డేట్లు కుదరక పోవడం వల్ల వరుణ్ తేజ్ కు జోడీగా నటించే అవకాశంను తిరష్కరించింది. ప్రస్తుతం వరుణ్ కు జోడీ కోసం దర్శకుడు కిరణ్ కొర్రపాటి కొత్త జోడీని వెదికే పనిలో ఉన్నాడు. త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేసి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది దసరాకు లేదా ఆ తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Please Read Disclaimer