టెన్త్ ప్రేమ ఎపిసోడ్ చెప్పిన ముద్దుగుమ్మ!

0

టాలీవుడ్ లేటెస్ట్ ముద్దుగుమ్మల్లో కియారా అడ్వాణీ ఒకరు. వరుస పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లలో నటిస్తున్న ఆమెకు తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చేయటం తెలిసిందే. ఈ మూవీతో ఆమె బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసేసుకున్నట్లైంది.

సినిమాల్లో తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కథానాయకుడు లాగి పెట్టి కొట్టేసే వైనం ఈ మధ్యన పెరుగుతున్నాయి. దీనికి ఎవరికి వారు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. అయినా.. ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీద ఎంత కోపం వచ్చినా.. చేయి లేవలేదు కదా? అమితంగా ప్రేమించే అమ్మ మీద లేవని చేయి.. అమ్మాయి మీద ఎందుకు లేస్తుందన్న దానికి సమాధానం చెప్పరు మన రైటర్లు.. దర్శకులు.

రీల్ లో అయితే పాత్ర పరంగా వచ్చే కొట్టించుకోవాటానికి రెఢీ అంటున్న కియారా.. రియల్ లైఫ్ లో మాత్రం నో ఛాన్స్ అని తేల్చేసింది. రీల్ ప్రేమలు.. కొట్టుకోవటాలు తర్వాత రియల్ లైఫ్ మాటేమిటంటూ అమ్మడ్ని అడిగితే..ఇప్పటికైతే సింగిల్ అని తేల్చేసింది. ఇప్పటివరకైతే అంటే.. ఇంతకు ముందు ఏదైనా లవ్ ట్రాక్ ఉందా? అంటే.. ఆసక్తికర రీతిలో రియాక్ట్ అయ్యింది.

తాను టెన్త గ్రేడ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడేదానినని.. తను స్నేహితుడే అని చెప్పింది. తామిద్దరం కూడా కలిసే తిరిగామన్న ఆమె.. ఇప్పటికి తను నా స్నేహితుడేనని చెప్పింది. అప్పడప్పుడు తనకు ఫోన్ చేస్తానని చెప్పిన కియారా.. టెన్త్ లో ఎగ్జామ్స్ కు ముందు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ తల్లికి దొరికిపోయినట్లు చెప్పింది.

పరీక్షల ముందు ఫోన్లో మాట్లాడటమా?.. నీకెంత ధైర్యం అంటూ అమ్మ తిట్టిందని.. ఆ దెబ్బతో చదువు మీద దృష్టి పెట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత ఆ రిలేషన్ క్లోజ్ అయినట్లు వెల్లడించింది. ఇంతకూ నీకు కావాల్సినోడు ఎలా ఉండాలన్న మాటకు.. నిజాయితీ.. విధేయత.. గొప్ప వ్యక్తిత్వం.. స్థిరత్వం.. కుటుంబాన్ని ప్రేమించే గుణం.. అన్నింటికి మించి అతడికి తన మీద పూర్తి విశ్వాసం.. నమ్మకం ఉండాలని పేర్కొంది. ఇన్ని గుణాలున్న డిజైనర్ పీస్ దొరుకుతాడా?
Please Read Disclaimer