బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తే తప్పా అంటున్న కియారా..

0

కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో నానుతున్న పేరిది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు అంతటి పేరును తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతలో కూడా ఎక్కడా రాజీపడట్లేదు. సినిమాలతోనే కాదు ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఇటీవల పచ్చని ఆకు చాటున టాప్ లెస్ పోజుతో పిచ్చెక్కించిన ఆమె ఫోటో విపరీతంగా వైరల్ అయింది.

ఆ ఫోటో కియారాకు ప్రత్యేక గుర్తింపుతో పాటు లేని తంటాలు కూడా తెచ్చిపెట్టింది. కొందరేమో ఆమె బోల్డ్ నెస్ కి మెచ్చుకుంటుంటే మరికొందరేమో ఆ ఫొటోతో మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాను దున్నిపారేస్తున్నారు. ఆ బోల్డ్ పోజు పై కియారా ఫోనుకి మెస్సేజులు లెక్కలేనన్ని వస్తున్నాయట. ఆ మెస్సేజిలను చదవలేక కియారా ఫోన్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేసానని తను చెప్పుకొస్తుంది.

ఎందుకంటే మీమ్స్ చేసుకున్నారంటే పర్లేదు కానీ డైరెక్ట్ గా అసభ్యకరమైన మెస్సేజెస్ చేస్తుంటే ఇబ్బందిగా ఉందని ఒక నటి సోషల్ మీడియాలో ధైర్యంగా ఎక్స్పెరిమెంటల్ గా ఉండటం చాలా కష్టమంటూ కియారా వెల్లడించింది. ఏదైతేనేం కియారా అందాల ఆరబోత బోల్డ్ యాక్టింగ్ ఫోటోలు ఫోటోషూట్లకే అంకితం కాదు. ఆమె ‘గిల్టీ’ లో చేసిన నాన్కి పాత్ర కూడా బోల్డ్ నెస్ కేటగిరికి చెందడం విశేషం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-