కియారా గ్లామర్ గుడ్ న్యూస్

0

బాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉండే బ్యూటీల లిస్టు తీస్తే ఆ లిస్టులో కియారా అద్వాని పేరు తప్పనిసరిగా ఉంటుంది. గ్లామర్.. నటన.. బోల్డ్ యాటిట్యూడ్.. హిట్స్ అన్నీ ఉన్న భామ కియారా. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ భామకు క్రేజ్ ఎక్కువ. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఈ భామ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘గుడ్ న్యూస్’. ఈ సినిమాలో అక్షయ్ కుమార్.. దిలిజిత్ దొసాంజ్.. కరీనా కపూర్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐవీఎఫ్ ప్రొసీజర్లో జరిగిన ఒక పొరపాటు వల్ల ఏం జరిగింది అనే బోల్డ్ కమ్ ఫన్నీ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా డిసెంబర్ 27 న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది. అసలే అప్సరస లాంటి భామ. పైగా ఫ్యాషన్ సెన్స్ పీక్స్ లో ఉంటుంది. అందుకే కత్తిలాంటి డ్రెస్సు వేసుకొని ఎంచక్కా తయారయింది. లైట్ బేబీ పింక్ కలర్ జంప్ సూట్ తళుక్కున మెరిసింది. ఆ సూట్ కు కూడా సూటయ్యేలా ఒక పెద్ద వీనెక్ కనిపిస్తోంది. దాంతో ఎంతో హాట్ నెస్ ఫుల్ గా బయటపడింది. ఆ హాట్ నెస్ మాత్రం కనీసం ఇరవై టన్నులు ఉంటుంది. సరిగ్గా అలా ఎలా చెప్తారు అనే అనుమానం రావచ్చు. నిజమే ఇరవై టన్నులు కాదు.. ఇరవై గ్రాములే అని ఇంకొకరు చెప్పొచ్చు కానీ ప్రూవ్ చెయ్యలేరు కదా . అందుకే ఎవరైనా బీటెక్ లో రాఘవేంద్రయిజం చదివిన మేథావి ఒక గ్లామరో మీటర్ లేక హాటో మీటర్ కనుక్కుంటే ఈ తిప్పలు ఉండవు. సరిగ్గా హాట్ నెస్ ఎంత అనేది తెలిసిపోతుంది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే ‘కబీర్ సింగ్’ తో భారీ హిట్ సాధించింది. ‘గుడ్ న్యూస్’ కాకుండా కియారా చేతిలో ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ అనే సినిమాలు ఉన్నాయి.
Please Read Disclaimer