ఆకుపచ్చ డ్రెస్సులో అదిరేటి పోజు

0

హిందీ సినిమా హీరోయిన్లు చాలామందే ఉన్నప్పటికీ వారిలో కియారా అద్వానికి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కారణం ఏంటంటే హిట్ సినిమాల్లో మాత్రమే నటించడం కాదు. జనాల ఫ్యూజులు ఎగిరిపోయే ‘లస్ట్ సీరీస్’ లాంటి వెబ్ సీరీస్ లో నటించడం. ఈమధ్య అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో ఒక్కసారిగా యమా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను చిన్నచూపు చూడదు.

తాజాగా కియారా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ మేకప్ చేసిన వారు లేఖ అని.. ఫోటోగ్రాఫర్ ఆదిత్య అని వెల్లడించింది. ఫోటో విషయానికి వస్తే మొదటి ఫోటోలో జిగేల్ జిగేల్ మని మెరుస్తున్న గ్రీన్ కలర్ డ్రెస్ లో హొయలు పోతోంది. ప్యాంట్ సూట్ లాంటిది అయినప్పటికీ డీప్ వీ నెక్ డిజైన్ ఉండేలా తన హాట్ నెస్ సంప్రదాయాన్ని కొనసాగించింది. హెయిర్ స్టైల్ కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఆ ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్ నాటీగా ఉంది. రెండో ఫోటోలో ఇంగ్లిష్ పాప్ సింగర్ తరహాలో స్టైలిష్ గా నిలుచుంది.

ఈ ఫోటోలకు ఇప్పటివరకూ 7 లక్షల లైక్స్ వచ్చాయి. అర్జున్ కపూర్ లాంటి హీరోలు కూడా లైక్స్ కొట్టారు. సాధారణ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోయారు. “నైస్ డ్రెస్”.. “ప్రీతీ.. ఇలా అయ్యావేంటి?”.. “పబ్జీ లో గిల్లీ సూట్ లా ఉందే”.. “నువ్వు ఇలాగే ఎవర్ గ్రీన్ గా ఉండాలి” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కియారా ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘ఇందూ కి జవాని’.. ‘షేర్ షా’ చిత్రాలలో నటిస్తోంది. వీటిలో ముందుగా అక్షయ్ కుమార్ చిత్రం ‘గుడ్ న్యూస్’ రిలీజ్ కానుంది.
Please Read Disclaimer