కియరా అక్కడ ఖాళీ అయితే కానీ..!?

0

దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవడం ఎలానో ఈ అమ్మడికి వంటబట్టినట్టే కనిపిస్తోంది. పట్టుమని పది సినిమాలు అయినా చేయలేదు. ఇంతలోనే చాలా ముదురులా వ్యవహరిస్తోంది. తనవైపు వచ్చిన ఏ క్రేజీ ఆఫర్ ని వదిలి పెట్టడం లేదు. అలా వరుసగా నాలుగైదు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసేసింది బాలీవుడ్ లో.

ఓవైపు `భరత్ అనే నేను` లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన ఈ అమ్మడు మునుముందు టాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేస్తుందనే అభిమానులు భావించారు. కానీ కియరా చూపు మాత్రం అస్సలు ఇటు లేనేలేదు. బాలీవుడ్ లో ఖాళీ అయితే అప్పుడు చూద్దాంలే! అన్నట్టుగానే ఉంది వాలకం. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సంచలన విజయం సాధించడం ఈ అమ్మడికి పెద్దగా కలిసొచ్చింది. వరుసగా ఊపిరి సలపనంతగా అవకాశాలు వెంట పడుతున్నాయి.

ఇప్పటికిప్పుడు ఈ భామ ఓ ఐదు భారీ చిత్రాల్లో నటించేస్తోంది. లక్ష్మి బాంబ్- గుడ్ న్యూస్- ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. అక్షయ్ కథానాయకుడిగా నటిస్తున్న లక్ష్మీ బాంబ్ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాయ్ లక్ష్మీ పోషించిన పాత్రను అమ్మడు పోషిస్తోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న గుడ్ న్యూస్ లోనూ అక్షయ్ – దిల్జీత్ లాంటి స్టార్లతో కలిసి నటిస్తోంది. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రఫికల్ ఫిలిం షేర్ షాలోనూ కియరా కీలక పాత్ర పోషిస్తోంది. యువహీరో కార్తీక్ ఆర్యన్ సరసన భూల్ బులయా అనే హారర్ కామెడీలోనూ నటిస్తోంది. ఆదిత్య సీల్ అనే కుర్ర హీరో సరసన ఇందూకి జవానీ చిత్రంలో ఆడిపాడుతోంది. ఈ చిత్రానికి అబిర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ని సినిమాల్లో నటిస్తూ వేరొక దక్షిణాది సినిమాకి సంతకం చేసే స్కోప్ ఎక్కడుంటుంది?Please Read Disclaimer