అందమైన కళ్ళతో మనసు గిల్లుతున్న కియారా!

0

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా అద్వానీ. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముంబై ముద్దుగుమ్మ 2014లో బాలీవుడ్ ‘ఫుగ్లీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఇక మహేష్ సరసన భరత్ అనే నేను చేసాక తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగిపోయి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయ విధేయ రామలో నటించింది. ఆ సినిమాలో అందాలు ఆరబోసినప్పటికీ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి కియారాను తెలుగులో పట్టించుకోవడం మానేసారు. కానీ అమ్మడు తగ్గకుండా హిందీలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’లో జోడీ కట్టింది ఈ భామ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు.

అయినా ఎంఎస్ ధోని బయోపిక్ తో మంచి ప్రశంసలు అందుకున్న ఈ భామ.. తనలోని మరో కోణాన్ని ‘లస్ట్ స్టోరీస్’లో ఆవిష్కరించింది. అందులో కియారా రెచ్చిపోయిన తీరు చూసిన తర్వాత ఎలాంటి పాత్రకైనా ఆమె రెడీ అని అర్థమైపోతుంది. కియారాకు దక్షిణాదిన అందాలు ఆరబోయడం కూడా చిన్న విషయమే. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోషూట్ విడుదల చేసింది. ఇది చూసిన కుర్రాళ్లకు మతి పోవడం ఖాయం అవుతోంది. బోల్డు డ్రెస్ వేసుకొని బోలెడు అందాలు కెమెరా ముందు పరచడం కియారాకి కొత్త కాదు. ఇదివరకు మ్యాగజైన్స్ కోసం టాప్ లెస్ పోజులు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం అమ్మడు డీసెంట్ లుక్ లో ఓ పిక్ పోస్ట్ చేసింది. చూడముచ్చటగా.. చక్కగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందమైన కళ్ళతో కుర్రకారు మనసు గిల్లుతోంది.. వినయ విధేయత గల సీత.
Please Read Disclaimer