సూపర్ హిట్ సౌత్ మూవీ సీక్వెల్ లో కియారా

0

భరత్ అనే నేను.. వినయ విధేయ రామ చిత్రాల తర్వాత తెలుగులో కియారా అద్వానీ నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆమె బిజీ బిజీగా ఉంది. ఈ సమయంలో ఒక సౌత్ మూవీకి ఆమె కమిట్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇటీవల లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో కియారా నటించింది. ఆయనతో ఈసారి సౌత్ లో కియారా వర్క్ చేయబోతుంది. తమిళంలో రూపొందబోతున్న చంద్రముఖి 2 చిత్రంలో లారెన్స్ మరియు కియారాలు కలిసి నటించబోతున్నారు.

క్ష్మీబాంబ్ చిత్రంకు గాను లారెన్స్ దర్శకత్వంలో నటించిన కియారా చంద్రముఖి 2 సినిమా కోసం ఆయనతో కలిసి నటించేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం. పి వాసు దర్శకత్వంలో మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న చంద్రముఖి 2 షూటింగ్ లో కియారా అద్వానీ పాల్గొనబోతుంది. సూపర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కియారా అద్వానీని నటింపజేస్తున్నారు.

2005 సంవత్సరంలో వచ్చిన చంద్రముఖి చిత్రంలో రజినీకాంత్.. జ్యోతిక.. నయనతార కీలక పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. తమిళంతో పాటు తెలుగులో కూడా సెన్షేషనల్ సక్సెస్ ను సాధించిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. రజినీకాంత్ కాకుండా లారెన్స్ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.