లస్టు భామ సూపర్ పంచులు

0

ఈమధ్య ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని తేడా లేకుండా ఎక్సర్ సైజులు ఎడాపెడా చేసేస్తున్నారు. ఇరవై ఏళ్ళ హీరోయిన్ నుంచి యాభై ఏళ్ళ లేటు వయసు భామల వరకూ కసరత్తులు ఒక నటి జీవితంలో భాగంగా మారిపోయాయి. క్రేజీ బ్యూటీల విషయంలో ఈ కసరత్తుల తీవ్రత సోషల్ మీడియా రిక్టర్ స్కేలుపై ఈజీగా ఆరు దాటుతుంది. ఈ కసరత్తులలో ఎన్నో రకాలు ఉన్నాయి. రెగ్యులర్ జిమ్ వెయిట్ ట్రైనింగ్ .. యోగా.. ఎరోబిక్స్.. పోల్ డ్యాన్స్.. ఇలా ఒకటి కాదు కనీసం పదిరకాల కసరత్తులు ఉన్నాయి. వాటిలో బాక్సింగ్ కూడా ఉంది. ఇప్పుడు లస్ట్ భామ ఆ బాక్సింగ్ ట్రెయినింగ్ తో అందరినీ చిత్తు చేస్తోంది.

రీసెంట్ గా ఈ భామ బాక్సింగ్ వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో కియారా బాక్సింగ్ గ్లవ్స్ ధరించి ఎదురుగా ఉన్న ట్రైనర్ పైన విరుచుకుపడుతూ పంచుల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ ట్రైనర్ చేతులను అడ్డం పెడుతూ వెనుకకు జరుగుతూ ఉన్నాడు. ఈ వీడియోను సరిగ్గా చూసిన ఏ వ్యక్తి కూడా కియారా వద్దకు #మీటూ ప్రతిపాదన తీసుకువచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ గా ఉన్నాయి పంచులు. స్పోర్ట్స్ డ్రెస్ ధరించి కియారా ఆ రకంగా బాక్సింగ్ పిడిగుద్దులు కురిపిస్తే వాడు డబ్బులు ఫుల్లుగా లాగే కార్పోరేట్ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా మారడం ఖాయం.

ఎంతో సున్నితంగా ఉండే సుందరి ఇలాంటి కఠినమైన కసరత్తులు చేయడం ఎందుకో మరి. సరే.. ఈ జెనరేషన్ భామలు అందరూ అంతేనని సరిపెట్టుకోవాలి. కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘ఇందు కి జవాని’ చిత్రాలలో నటిస్తోంది.
Please Read Disclaimer