దోపిడీ క్రియేటివిటీ అంటూ చీవాట్లు

0

బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ క్రియేటివిటీ గురించి పరిశ్రమ వర్గాలు సహా పలువురు ఆసక్తిగా మాట్లాడుకుంటుంటారు. ప్రతియేటా బాలీవుడ్ నటీనటులతో ప్రత్యేకంగా డబు రత్నానీ క్యాలెండర్ ని లాంచ్ చేస్తుంటారు. ఈ క్యాలెండర్ కి ఉన్న పాపులారిటీ అసాధారణం.

ఈసారి క్యాలెండర్ షూట్ లో బాలీవుడ్ అగ్ర కథానాయికల ఫోటోలు హైలైట్ గా నిలిచాయి. ఇందులో కియరా అద్వాణీ ఫోటోషూట్ సంథింగ్ స్పెషల్ అన్న టాక్ వినిపించింది. ఒక పచ్చని ఆకును అడ్డు పెట్టుకుని కియరా నగ్నత్వాన్ని కవర్ చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటోకి స్ఫూర్తి ఎక్కడిది? అన్నది వెతికితే అదో ఇంటర్నేషనల్ ఫోటోషూట్ కి స్ఫూర్తి అని తెలుస్తోంది. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ మేరీ బార్ష్ ఫోటో షూట్ తో దీనికి పోలికలు ఉన్నాయి. ఇదో కాపీ ఫోటోషూట్ అంటూ ఇప్పుడు నెటిజనులు ఆ రేంజులోనే విరుచుకుపడుతున్నారు.

ఫోటోషూట్ ప్లాగియారిజం.. డబూ ఓవర్ రేటెడ్ అంటూ అతడిని ఓ రేంజులో ఆడుకుంటున్నారు యూత్. ఫోటోగ్రాఫర్ డబూ ఫాల్ట్ ఉన్నా.. కియరాను కూడా ట్రోల్ చేస్తూ హీటెక్కిస్తున్నారు. కథలు కాపీ.. పోస్టర్లు కాపీ.. సీన్లు కాపీ అంటూ గొడవ చేసే నెటిజనం ఇప్పుడు ఫోటోషూట్ కాపీ అంటూ బోలెడంత రచ్చ చేస్తుండడం చర్చకు వచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-