అందం ఒక్కటే సరిపోదు : కియారా

0

బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు వెబ్ సిరీస్ ల్లో కూడా తన సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు బోల్డ్ పాత్రలు చేసేందుకు కూడా సిద్ద పడే కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో భరత్ అనే నేను.. వియ విధేయ రామ చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలో లక్ష్మీబాంబ్ మరియు ఇందూకీ జవానీ చిత్రాల్లో నటిస్తోంది.

కబీర్ సింగ్ చిత్రంలో నటించడంతో కియారా బాలీవుడ్ లో బిజీ అయ్యింది. సౌత్ నుండి ఆఫర్స్ వస్తున్నా కూడా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా వాటికి నో చెబుతోందట. నటిగా ‘లవ్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తో మెప్పించిన కియారా అద్వానీ ప్రస్తుతం హీరోయిన్ గా తన అందంతో పాటు అభినయంతో మెప్పిస్తోంది. ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదని ఆత్మ విశ్వాసంతో ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగే సత్తా ఉండాలని చెప్పుకొచ్చింది.

అందంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కొద్ది కాలమే ఉంటారు. అదే అందంతో పాటు నటిగా మంచి ప్రతిభ చూపించగలిగే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారని కియారా అభిప్రాయం. ఈమె నటించిన ‘ఇందూకీ జవానీ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కియారా అద్వానీ మీడియాలో తరుచుగా కనిపిస్తోంది. కియారా నటించిన మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం అవ్వడంతో ‘ఇందూకీ జవానీ’ చిత్రంపై అందరి దృష్టి ఉంది. ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా వరుసగా చిత్రాలు చేస్తున్న కియారా మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేస్తూ తన నటన ప్రతిభను ప్రేక్షకులకు చూపిస్తోంది.
Please Read Disclaimer