బ్రాకెట్ వేయకపోతే ఎంతకైనా తెగిస్తుందట

0

కియరా అద్వానీ.. బాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. `లస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ కియరాని బోల్డ్ బ్యూటీగా ఎలివేట్ చేసింది. సినిమాల్ని మించి నటిగా పేరు తెచ్చింది ఈ సిరీస్. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకుల టెంపరేచర్ అమాంతం పెంచేసింది ఈ భామ. ఇక గతేడాది విడుదలైన `కబీర్ సింగ్` చిత్రంలో ప్రీతి పాత్రలోనూ జీవించి మంచి పేరు తెచ్చుకుంది. కబీర్ సింగ్ రిలీజ్ తర్వాత ఎక్కడికెళ్ళినా తనని ప్రీతి అని పిలుస్తున్నారని చెప్పుకుని గర్వపడుతుంది కియరా. అంతేకాదు ఏ పాత్ర చేసినా తనని ఆ పేరుతో పిలుస్తున్నారట. నటిగా అది తనకి ఆ పిలుపు అత్యంత సంతోషాన్నిస్తుందని.. కెరీర్ ప్రారంభం నుంచి తనకి డిఫరెంట్ రోల్స్ రావడం లక్కీగా భావిస్తున్నానని చెబుతోంది.

లేటెస్ట్ గా కియరా నటించిన ‘గిల్టీ` నెట్ ఫ్లిక్స్ సిరీస్ మరోసారి ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నరైన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ప్రారంభమైంది. 2018లో లవర్స్ డే రోజున జరిగిన రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో తెరకెక్కిన సిరీస్ ఇది. తన ప్రియుడిచే రేప్ కి గురైన నాన్కీ అనే అమ్మాయి జర్నీని తెలిపే కథాంశంతో తెరకెక్కింది. నాన్కీగా కియరా నటించారు. తాజా ఇంటర్వ్యూ లో మరిన్ని ఆసక్తికర సంగతులే చెప్పింది.

కియరా మాట్లాడుతూ.. “కెరీర్ ప్రారంభం నుంచే నేను స్టీరియోటైమ్ పాత్రలు చేయకూడదని రోజూ ప్రార్థించాను. లక్కీగా మొదట్నుంచి నాకు డిఫరెంట్ రోల్స్ వచ్చాయి. ఇదేమీ కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. అలా జరిగిపోయింది. అన్ని రకాల పాత్రలు వస్తే బావుంటుందనే నేను ఎప్పుడూ అనుకున్నా. సరిగ్గా అదే జరిగింది. అవకాశాలు నా వద్దకు వచ్చినప్పుడు అందులో నేను భిన్నమైన పాత్రలను వెతుక్కున్నాను. దీంతో డిఫరెంట్ రోల్స్ వాటంతట అవే వస్తున్నాయి. నన్ను గిరి గీసి ఓ బ్రాకెట్ లోనే ఉంచకుండా ఇలా నాలోని డిఫరెంట్ యాంగిల్స్ ని చూపిస్తున్న దర్శకులకు థ్యాంక్స్“ అని మేకర్స్ ని ఆకాశం లోకి ఎత్తింది.

అంతటితో ఆగలేదు ఇంకా చెబుతూ “కబీర్ సింగ్` టైమ్లో ఆడియెన్స్ నన్ను ప్రీతిగా పిలవడం స్టార్ట్ చేశారు. నేనే ప్రీతినని నమ్మారు. అలాగే `గుడ్ న్యూస్` వచ్చినప్పుడు నాలో పంజాబీకి చెందిన మహిళ మోనికాని చూసుకున్నారు. అలానే ఆదరించారు. ఇప్పుడు `గిల్టీ`లో నా నాన్కి పాత్రని లవ్ చేస్తున్నారు. ఇలాంటి వర్సెటైల్ రోల్స్ వచ్చినప్పుడే ఏ నటీనటులకైనా సుధీర్ఘ కెరీర్ ఉంటుంది. ఈ విషయంలో నేను లక్కీగా భావిస్తున్నా. ఇప్పుడు ఆడియెన్స్ మంచి కంటెంట్ ఎక్కడున్నా చూస్తున్నారు. అందుకు సినిమా టీవీ.. వెబ్ అనే తేడా లేదు“ అని పేర్కొంది.

`కబీర్ సింగ్` తర్వాత పలు క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ కియరా దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `ఆంగ్రేజీ మీడియం`లో ‘కుడి ను నాచ్చే డే’ అనే స్పెషల్ సాంగ్ లో మెరిసిన కైరా ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి `లక్ష్మీ బాంబ్` లేడీ ఓరియెంటెడ్ చిత్రం `ఇందూ కి జవానీ` సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా`లో అలాగే కార్తీక్ ఆర్యన్ తో కలిసి `భూల్ భులైయా 2`లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-