కబీర్ సింగ్ బ్యూటీ తమ్ముడు ఇతనే

0

బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు. ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కియారా ఒక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘కబీర్ సింగ్’ రిలీజుకు ముందే కియారా చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ‘కబీర్ సింగ్’ సక్సెస్ తర్వాత మరి కొన్ని ఆఫర్లు వచ్చాయి. దీంతో షూటింగులతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఎంత బిజీగా ఉన్నా ఓ చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ఒక వెకేషన్ కు వెళ్ళింది.

ప్రస్తుతం కియారా తన కుటుంబ సభ్యులతో ఇటలీలో ఉంది. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను అభిమానుల కోసం పంచుకుంది. మొదటిసారిగా తన ముద్దుల తమ్ముడు మిశాల్ అద్వానితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. మిశాల్ కు ఫోటోలంటే పెద్దగా నచ్చదని అందుకే ఎప్పుడూ ఫోటోలకు దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చింది. అతి కష్టం మీద ఈ ఫోటోలకు తమ్ముడిని ఒప్పించానని అయినా ఫోటోలలో నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా పోజిచ్చాడని వెల్లడించింది. తన కుటుంబ సభ్యులతో ఇలా అద్భుతమైన వెకేషన్ గడిపేందుకు సహకారించిన బుకింగ్ కామ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ ఫోటోలలో కియరా అందమైన స్మైల్ ఇచ్చింది కానీ తమ్ముడు మిశాల్ మాత్రం సీరియస్ గానే పోజిచ్చాడు. లుక్స్ వైజ్ హిందీ హీరోలా కనిపిస్తున్నాడు కానీ ఫోటోలు ఇష్టం లేదు కాబట్టి ఆమాత్రం పోజివ్వడమే గొప్ప అని మనం సర్దుకోవాలి! ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘లక్ష్మి బాంబ్’.. ‘గుడ్ న్యూస్’.. ‘ఇందు కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer