కబీర్ లా కొడితే కియారా రియల్ లైఫ్ లో ఒప్పుకోదట

0

బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు కియారా అద్వాని ఒకరు. ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కియారా రేంజ్ మరింతగా పెరిగింది.. డిమాండ్ కు తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా పెంచిందనే టాక్ కూడా ఉంది. సక్సెస్ జోష్ లో ఉన్న కియారా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.

ఈమధ్య కియారా-సిద్ధార్థ్ మల్హోత్రాలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయమే కియారాతో ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని.. తానింకా ప్రస్తుతానికి సింగిలేనని నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఎవరితో అయినా ప్రేమలో పడితే అతన్నే పెళ్ళి చేసుకుంటానని వెల్లడించింది. రిలేషన్ ఎలా ఉండాలనే విషయంపై మాట్లాడుతూ భాగస్వామిని కొట్టడం.. అవమానించడం లాంటివి చేసేవారు తనకు నచ్చరని చెప్పింది. కియారా ఈ మాట చెప్పినప్పుడు “మరి కబీర్ సింగ్ ప్రీతిని చెంపదెబ్బ కొట్టే సీన్ గురించి మీరేమంటారు?” అని అడిగితే.. “వ్యక్తిగతంగా నేను అలాంటి ప్రవర్తనను అంగీకరించను.. ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను చెంపదెబ్బ కొట్టేందుకు భాగస్వామికి అవకాశం ఇవ్వను.” అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరి అలాంటప్పుడు ప్రీతి పాత్రలో మీరు ఎలా నటించారని ప్రశ్నిస్తే “నిజ జీవితం వేరు.. సినిమాల కోసం పోషించే పాత్రలు వేరు” అని చెప్పింది. ఒక్కసారి సెట్ లోకి ఎంటర్ అయితే అక్కడ తాను కియారా అనే విషయం మర్చిపోతానని.. ఏ పాత్ర పోషిస్తుంటే ఆ పాత్రలా ఆలోచిస్తానని చెప్పింది. ఇదంతా చూస్తుంటే కియరాలో ఒక అపరిచితురాలైన మహానటి ఉన్నట్టుందే!
Please Read Disclaimer