మెగా హీరో అంటేనే భయపడుతుందా?

0

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ ఆ సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రానికి ఓకే చెప్పింది. బ్యాక్ టు బ్యాక్ రెండు స్టార్ హీరోల సినిమాలను చేసిన కియారా అద్వానీ మళ్లీ తెలుగు మొహం చూడటం లేదు. వినయ విధేయ రామ చిత్రం ఫలితం కారణంగా ఈమె తెలుగు సినిమాల్లో నటించాలంటేనే భయంగా ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కాని చూద్దాం చూద్దాం అంటూనే చివరకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ ఈమెను సంప్రదించాడట. ఈసారి కూడా కియారా అద్వానీ నుండి నో అనే సమాధానం వచ్చింది. దాంతో క్రిష్ ప్రస్తుతం ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డాడు.

మెగా హీరోలు ఇద్దరికి కూడా నో చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా మూవీ వినయ విధేయ రామ ప్రభావం కారణంగానే వరుణ్ మరియు పవన్ లతో నటించేందుకు కియారా భయపడుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో వైపు హిందీ అర్జున్ రెడ్డిలో నటించిన తర్వాత ఈ అమ్మడి రేంజ్ అమాంతం పెరిగింది.

ప్రస్తుతం అక్కడ చాలా బిజీగా ఉండటం వల్ల పవన్ కు డేట్లు ఇవ్వలేక పోయిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాకు కియారా అద్వానీ నో అయితే చెప్పింది. కియారా నో చెప్పడంతో ఆహా కళ్యాణం ఫేం వాణీ కపూర్ తో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer