నా పేరు కియారా నా పేరు కాపీ..!

0

“వాట్స్ ఇన్ ఎ నేమ్. ఎ రోస్ బై ఎనీ అదర్ నేమ్ వుడ్ స్మెల్ యాజ్ స్వీట్” అంటూ షేక్స్ పియర్ రోమియో జూలియట్ కోసం రాసిన ఒక కొటేషన్ చాలా ఫేమస్. పేరులో ఏముంది అని ఆయన తేలిగ్గా తీసిపారేయవచ్చు కానీ.. మరీ అదంతా తేలిగ్గా తీసిపారేసే విషయం కాదు. అమెరికాలో అందరూ డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఉత్తర కొరియాలో అందరూ లిటిల్ మ్యాన్ కిమ్ ఉన్ జోంగ్ పేరు పెట్టుకుంటే అసలు ట్రంపు.. కిమ్ము ల ప్రత్యేకత ఏం కావాలి? కాబట్టి ఎవరి పేరుకు ఉండే ప్రత్యేకత వారిదే. ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పట్టించుకుంటారు. కొత్తగా వచ్చే హీరో హీరోయిన్ల పేరుతో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ ఉంటే వెంటనే కొత్త పేరు పెట్టుకుంటారు. కియారా అద్వాని కూడా అలాగే చేసింది.

కొద్దిరోజుల క్రితం కియారా అనేది తన అసలు పేరు కాదని వెల్లడించిన సంగతి తెలిసిందే. కియారా అసలు పేరు అలియా అద్వాని.. అయితే అప్పటికే అలియా భట్ అంటూ మరో హీరోయిన్ ఉండడంతో పేరు మార్చుకోవాలనే ఉద్దేశంతో ‘కియారా’ పదాన్ని తన అలియా అద్వానికి జోడించిందట. ఇప్పుడు కూడా తన పేరు కియారా అలియా అద్వాని అని ఉంటుంది కానీ ‘కియారా’ పేరుతో పాపులర్ అయింది. అయితే ఈ కియారానే ఎందుకు.. ఖజురహో అద్వాని అని పెట్టుకోవచ్చు కదా? అలా ఎంచుకునేందుకు తనకో ప్రేరణ ఉందట. ఆ విషయాన్ని రీసెంట్ గా వెల్లడించింది.

రణబీర్ కపూర్ సినిమా ‘అంజానా అంజానీ'(2010) లో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఆ సినిమాలో ప్రియాంక పాత్ర పేరు కియారా. ఈ పేరునే మన లస్ట్ భామ తనకు పెట్టుకుందట. మరి ప్రియాంక పాత్ర పేరు పెట్టుకుంటే ఎంత ఫేమస్ అయిందో! ఏదైతేనేం.. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లలో ఒకరు కియారా. ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడి పేరు మార్మోగిపోతోంది. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
Please Read Disclaimer