ఎమోషనల్ అవుతున్న కబీర్ సుందరి

0

ఊహించని విధంగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఈ ఇయర్ టాప్ బ్లాక్ బస్టర్ గా నిలవడం బాలీవుడ్ వర్గాలను కూడా షాక్ కు గురి చేసింది. షాహిద్ కపూర్ లాంటి మీడియం రేంజ్ హీరోతో కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సౌత్ డైరెక్టర్ ఇలాంటి రిజల్ట్ తేవడం అక్కడి విమర్శకులకు మింగుడు పడటం లేదు. వంద కోట్లు వస్తే చాలు అనుకునే టైంలో ఏకంగా మూడు వందల కోట్ల టార్గెట్ రీచ్ కావడం అంటే మాటలా. ఇప్పటికీ మెట్రోస్ లో కబీర్ సింగ్ వీర విహారం కొనసాగుతూనే ఉంది.

ఈ సందర్భంగా హీరోయిన్ కియారా అద్వానీ సోషల్ మీడియా లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టింది. తన కెరీర్లో కబీర్ సింగ్ ఎంత గొప్ప మలుపు అయ్యిందో వివరిస్తూ ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి అందులోనూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానులతో ఆనందాన్ని షేర్ చేసుకుని. ఇలాంటి గొప్ప జర్నీలో భాగం కావడంలో తా భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించింది. తెలుగులో మహేష్ బాబు భరత్ అనే నేనుతో పరిచయమైన కియారాకు ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామా చేదు ఫలితాన్ని ఇచ్చింది.

ఆపై చాలా ఆఫర్స్ వచ్చినా హిందీ అవకాశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన కియారా అందుకు తగ్గట్టే అక్కడ స్టార్ గా ఎదిగేందుకు ఒక్కో అడుగు వేస్తోంది. లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రను చేసిన మార్కులు కొట్టేసిన కియారాకు ఇప్పుడు గతంలో స్క్రీన్ టెస్టులు ఆడిషన్లకు రమ్మని ఎవరూ పిలవడం లేదట కేవలం డేట్స్ ఇస్తే చాలు అడ్వాన్స్ చెక్ పంపుతామని నిర్మాతలు ఫోన్ చేస్తున్నారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలు చెప్పింది. తెలుగులో వరసగా స్టార్లతో సినిమాలు చేయాలనీ కోరుకుంటున్న అభిమానుల కోరిక అంత ఈజీగా నెరవేరేలా లేదు. అక్కడ డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది మరి.
Please Read Disclaimer