జిరాఫీ సరే! పక్కనే బోయ్ ఫ్రెండ్ ఎవరో?

0

2019 కియరా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యింది. `కబీర్ సింగ్` రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుని.. ఏడాది ముగింపులోనూ `గుడ్ న్యూజ్` రూపంలో మరో హిట్ అందుకుంది. ఇదే హుషారులో రెట్టించిన ఉత్సాహంతో 2020లో అడుగు పెట్టింది. ఇప్పటికిప్పుడు మూడు నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.

గత కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా లవ్వాయణంపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ సెట్స్ లో బాగా క్లోజ్ అయిపోతున్నారన్న వార్తలు ముంబై మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ జంటగా నటించిన `షేర్షా` రిలీజ్ కి రానుంది. ఇక ఈ సినిమా సెట్స్ లో రకరకాల పుకార్లు బయటకు వచ్చాయి. సిద్ధార్థ్ ని వదిలి క్షణమైనా ఉండలేని స్థితిలో కియరా ఉంది! అంటూ జోరుగా గాసిప్స్ వేడెక్కిస్తున్నాయి. తాజాగా న్యూఇయర్ సెలవుల్ని కియరా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో ఫుల్ గా ఎంజాయ్ చేసిందని తెలుస్తోంది.

కియరా రివీల్ చేసిన వీడియో ఆ సంగతిని చెబుతోంది. ఈ వీడియోలో.. కియారా ఓపెన్ టాప్ జీపులో హాయిగా కూర్చొని చాలా దగ్గరగా జిరాఫీని చూస్తోంది. ఆ సమయంలో పక్కనే కూచుని ఆ వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి `వావ్` అనడం వినిపించింది. ఆ వాయిస్ సిద్ధార్థ్ వాయిస్ అనడంలో సందేహమేం లేదు. ఇంతకుముందు అతడు కూడా అడవిలో విహరిస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో రివీల్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ కలిసి నూతన సంవత్సరాన్ని ఇలా అడవుల్లో జంతువుల మధ్య జాలీగా గడుపుతున్నారనే సందేహానికి తావిస్తోంది. `వాకింగ్ సఫారి # వన్ విత్ నేచర్` అంటూ కియరా లేటెస్ట్ గా రివీల్ చేసిన ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. మరొక ఫోటోలో కియారా గాలి బెలూన్ రైడ్ లో వెళుతోంది. ఆ సమయంలో తన చేతిలో బైనాక్యులర్ ఉంది. “మీరూ చూస్తారా .. చూస్తే.. చాలా దగ్గరగా అనిపిస్తుంది“ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది.

సిద్ధార్థ్ – కియారా జంటగా నటిస్తున్న షేర్షా కథాంశం ఆసక్తికరం. కార్గిల్ యుద్ధంలో పోరాడుతూ తన జీవితాన్ని అర్పించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. సిద్దార్థ్ యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు. కియరా అతడి ప్రియురాలిగా నటిస్తోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. అక్షయ్ సరసన `లక్ష్మీ బాంబ్` అనే మరో చిత్రంలోనూ కియరా నటిస్తోంది.
Please Read Disclaimer