కియారా దెబ్బకు.. ఎయిర్ పోర్ట్ సఫా!

0

బాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ భామల లిస్టు చూస్తే కియారా అద్వాని టాప్ లోనే ఉంటుంది. చేతినిండా ఫుల్లుగా ఆఫర్లతో ఈ బ్యూటీ ఊపిరిసలపనంత బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా కియారా ఓ ఫారెన్ లొకేషన్ కు ఓ షార్ట్ హాలిడే వెకేషన్ కు వెళ్ళింది. ఇండియాకు తిరిగి వస్తుంటే ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఇక జనాలు ఊరుకోరు కదా.. తమ కెమెరాలలో కియారాను బంధించారు.

మొదటి నుంచి కియరా ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు దుస్తులు ధరించడం.. ఆ డ్రెస్సులు కళాపోషకుల మతులు పోగొట్టడం కియారాకు చాలా సాధారణం. ఈసారి కూడా అదే పని చేసింది. పింక్ కలర్ నైకీ స్పోర్ట్స్ ప్యాంట్.. టాప్ ధరించి ఆ పైన ఒక స్టైలిష్ జాకెట్ ను వేసుకుంది. అఫ్ కోర్స్.. ఆ జాకెట్ కు జిప్పు వేసుకోకుండా వదిలేసింది లెండి. ఆ జిప్పు వేసుకుని ఉంటే దాన్ని స్టైల్ అని ఎందుకు అంటారు.. దుప్పటి కప్పుకోవడం అంటారు! ఈ డ్రెస్ కు మ్యాచింగ్ గా ఉండే షూస్.. కళ్ళకు గాగుల్స్ ధరించి.. చేతిలో ఒక కత్తి లాంటి హ్యాండ్ బ్యాగ్ తో నడుచుకుంటూ వచ్చింది. ఒక చేత్తో తన శిరోజాలను సవరించుకుంటూ కెమెరాలను ఓరచూపు చూసింది.

వెకేషన్ లో ఉంది కదా అనుకునే లోపే ఇలా ‘నేను ఉన్నాను .. నేను వచ్చాను’ అంటూ సోషల్ మీడియాకు ఎలుగెత్తి చాటింది. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కియారా ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer