పాపది హాలీవుడ్ రేంజ్!

0

ఈమధ్య బాలీవుడ్ లో అగ్రపథం వైపు దూసుకుపోతున్న భామ కియారా అద్వాని. సీనియర్ హీరోయిన్ల హవా తగ్గడం.. కొందరేమో పెళ్ళి చేసుకొని శ్రీమతులుగా మారడంతో కియారా లాంటి న్యూ జెనరేషన్ బ్యూటీలకు డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ కు తగ్గట్టే కియారా లాంటి హీరోయిన్లు తమ టాలెంట్ తో.. బోల్డ్ నెస్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. రీసెంట్ గా కియారా ‘కబీర్ సింగ్’ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో మంటలు పెట్టే పనిలో కూడా తెగ బిజీగా ఉంది.

కియరా ఫ్యాషన్ పీక్స్ లో ఉంటుందన్న నిజం అందరికీ తెలిసిందే. సందర్భానికి తగ్గట్టు దుస్తులు ధరించడం.. ఆ దుస్తులకు తన స్టైల్ ను యాటిట్యూడ్ ను జోడించి నెటిజన్ల తాట తీయడం కియారాకు చిటికెలో పని. కియారా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ఫోటోలే కాకుండా ముంబై మీడియా కూడా ఎప్పటికప్పుడు కియారా ఫోటోలను తీస్తూ సోషల్ మీడియా వేడిని ఒకే లెవెల్ లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. కియారా ఈమధ్య బాక్సింగ్ ట్రెయినింగ్ తీసుకుంటోంది. సదరు బాక్సింగ్ క్లాస్ నుంచి బయటకు వచ్చే సమయంలో కియారా ఫోటోలను క్లిక్కుమనిపించారు ఫోటోగ్రాఫర్లు. ఆ డ్రెస్ కలర్ కాంబినేషన్.. ఆ స్టైల్ చూస్తే పాప అసలు ఇండియాలో ఉండాల్సిన బాపతు కాదు.. ఎక్కడో హాలీవుడ్ లో ఉండాల్సింది అని మనకు అనిపించకమానదు. డ్రెస్సే కేక అనుకుంటే.. నడుముకు కట్టుకున్న షర్టు.. పెద్ద హ్యాండ్ బ్యాగ్ స్టైల్ ను మరింతగా పెంచాయి. ఇక ఫోన్లో మాట్లాడుతూ అరనవ్వు నవ్వుతూ ఇచ్చిన పోజు అదరహో అని చెప్పాలి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కియారా ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేయలేనని ‘నో’ చెప్పిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక రష్మిక సినిమానుండి తప్పుకుందట. దీంతో కియారాను సంప్రదిస్తే అక్కడ కూడా అదే సమస్య ఎదురైందట.
Please Read Disclaimer