జిమ్ము డ్రెస్సులో జివ్వనిపిస్తోందే

0

బాలీవుడ్ లో కియారా అద్వానికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఏమాత్రం తీరిక లేకుండా కియారా బిజీ బిజీగా గడుపుతోంది. ఈతరంలో హీరోయిన్ గా ఉండడం అంటే సాధారణం కాదు. పర్ఫెక్ట్ షేప్ లో ఉండాలి. అందుకోసం ప్రతిరోజూ జిమ్ము బాట పట్టాల్సిందే. అందుకే కియారా కూడా రోజూ వ్యాయామశాలకు పోయి అక్కడ కఠినమైన కసరత్తులు చేస్తూ ఉంటుంది.

మరి కియారా లాంటి భామ బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు ఊరుకోరు కదా.. కియారా జిమ్ బయట కనిపించగానే క్లిక్కుమనిపించారు. ఈ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలోకి కూడా వచ్చాయి. ఈ ఫోటోలలో కియారా ఆకుపచ్చరంగు టాప్.. అదే రంగులో ఉన్న ప్యాంట్ ధరించి గ్రే కలర్ టీ షర్టును అలా నడుముకు చుట్టుకుంది. ఒక చేతిలో జ్యూస్ కప్.. మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకుంది. కళ్ళజోడు ధరించి చిరునవ్వుతో కారు ఎక్కబోతూ ఉంది. మరో ఫోటోలో ఫోటోగ్రాఫర్లకు వయ్యారంగా హాయ్ చెప్పింది. అసలు ఈ ఫోటోలు చూస్తుంటే ఒక మోడరన్ అందాల దేవత తరహాలో ఉంది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే ‘కబీర్ సింగ్’ తో భారీ హిట్ సాధించింది. ప్రస్తుతం చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer