మేకప్ లేని కియరా అందాన్ని చూడగలరా ఇలా?

0

మేకప్ లెస్ గా కనిపించేందుకు స్టార్లు అంతగా ఆసక్తి చూపరు. నిరంతరం వెంటాడే మీడియా కళ్లు ప్రతిదీ బయట పెట్టేస్తుండడంతో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వ్యక్తిగతంగా ఓపెన్ అవ్వడం ఇష్టం ఉండదు చాలా మందికి. అయితే బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది అంటూ ఇంతకుముందు అందాల చందమామ కాజల్ క్లాస్ తీస్కున్న సంగతి తెలిసిందే. క్లాస్ తీస్కోవడమే కాదు.. మేకప్ లెస్ గా కనిపించి ఒరిజినల్ రూపాన్ని బయటపెట్టడంతో అది కాస్తా అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాజల్ డేర్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఇక కాజల్ మాత్రమే కాదు.. చాలామంది నాయికలు అప్పుడప్పుడు మేకప్ లేకుండా క్యాజువల్ గా పబ్లిక్ లో కనిపిస్తూ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు ఇటీవల.

అయితే నవతరం భామల్లో ఈ తరహాలో కనిపించేది తక్కువే. ముంబై క్యాట్ వాక్ భామ కియరా అద్వాణీ అయితే ఇప్పటివరకూ మేకప్ లేకుండా బయట కనిపించిందే లేదు. నిరంతరం నియాన్ కాంతుల జిగిబిగి నడుమ మిరుమిట్లు గొలిపే ర్యాంపుపై తళుకుబెళుకులు ప్రదర్శించడమే తనకు అలవాటు. కానీ అందుకు భిన్నంగా ఇదిగో ఇలా మేకప్ లేకుండా చాలా క్యాజువల్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.

ఒక లూజ్ వైట్ టీషర్ట్.. టైట్ లెగ్గిన్ ధరించి ఎంతో ఇదిగా కనిపించింది కియరా. కనీసం హెయిర్ బ్యాండ్ అయినా ఉపయోగించకుండా శిరోజాల్ని ఆరబోసి సహజంగా కనిపించింది. తన లగ్జరీ కార్ లో ఎక్కడికో ప్రయాణం అవుతూ ఇలా కెమెరాకి ఫోజిచ్చింది. దీంతో ఈ ఫోటో కాస్తా అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది. కియరా కెరీర్ ని పరిశీలిస్తే బెస్ట్ ఫేజ్ లో ఉంది. ఇప్పటికిప్పుడు అరడజను సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీ బెస్ట్ స్టార్లలో ఒకరిగా గుర్తింపు దక్కించుకుంది.
Please Read Disclaimer