డెనిమ్ క్యాజువల్స్.. స్టన్నింగ్ లుక్

0

అందంగా ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది. కానీ అది సరిపోదు.. డ్రెస్ సెన్స్.. బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే ఫ్యాషనిస్టా.. ఫ్యాషన్ ఐకాన్ అనే బిరుదులు రావు. కియారా అద్వానికి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా కొనసాగుతోంది. పాత్రకు తగ్గట్టు ఎలా తనను తాను మలుచుకోగలదో.. డ్రెస్ కు తగ్గట్టు అంతే పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ మెయింటెయిన్ చేస్తుంది కియారా.

తాజాగా ఈ భామ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అంతే.. అక్కడ చకోరపక్షుల్లా కాచుక్కూచున్న ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలను క్లిక్ మనిపించి కియారాకు సూపర్ ఫోటోలు తీశారు. అందులో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో కియారా క్యాజువల్ గా చిరుగులు ఉన్న జీన్స్ ప్యాంట్.. డెనిమ్ షర్ట్ ధరించి భుజానికి ఒక స్టైలిష్ బ్యాగ్ ధరించి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తోంది. సగం షర్టును ఇన్ చేసి మిగతా షర్టు ను ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లో బైటకు వదిలేసి రఫ్ టచ్ ఇచ్చింది. లూజ్ హెయిర్.. స్టైలిష్ గాగుల్స్ తో హాలీవుడ్ నటీమణి తరహాలో కనిపించింది. పెదవులపై అందమైన సన్నటి అరనవ్వుతో అల్ట్రా స్టైలిష్ అప్సరసలా కనిపిస్తోంది.

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కావడంతో కియారా క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం కియారా చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ ‘కబీర్ సింగ్’ రిలీజ్ కు ముందే సైన్ చేసిన ప్రాజెక్టులు. ‘కబీర్ సింగ్’ సక్సెస్ తర్వాత కొత్త ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయట.
Please Read Disclaimer