ఫ్యాషన్ డిబేట్.. కియరా Vs సారా

0

సెలబ్రిటీల స్టైల్ పై ఎప్పుడూ మీడియా ఫోకస్.. ఫ్యాన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోల.. హీరోయిన్ల హెయిర్ స్టైల్స్.. దుస్తులను అనుకరిస్తూ ఉంటారు. అయితే దుస్తుల విషయంలో ఒక్కో సెలబ్రిటీ స్టైల్ ఒక్కోతీరుగా ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్ల విషయమే తీసుకుంటే కొంతమంది హీరోయిన్లు ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటారు. అలాంటి భామల లిస్టులో కియారా అద్వాని.. సారా అలీ ఖాన్ కూడా ఉంటారు. ఈ భామలు రీసెంట్ గా రెండు వేరు వేరు సందర్భాలలో ఒకే రకమైన స్కర్ట్ ధరించడం విశేషం.

ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీలు ఇలా ఒకే రకమైన డ్రెస్ లో కనిపిస్తే ఇక సోషల్ మీడియాలో పోలికలు మొదలవుతాయి కదా? ఎవరు ఆ డ్రెస్ ను అందంగా ధరించారు.. ఎవరి స్టైల్ అదిరింది ఎవరి స్టైల్ ఆదరలేదు అనే చర్చలు జోరుగా సాగుతాయి. అలానే కియారా.. సారాల విషయంలో చర్చలు సాగాయి. ఇద్దరూ ఒకే రకంగా ఉండే పోల్కా డాట్స్ ఉండే ఎల్లో స్కర్ట్ ధరించారు. అయితే కియారా ఆ స్కర్ట్ కు మ్యాచింగ్ గా వైట్ స్లీవ్ లెస్ షర్టు టాప్ ధరించింది. నడుముకు బెల్ట్ తరహాలో ఒక ఎల్లో కలర్ బ్యాగ్ ధరించింది.. కళ్ళకు గాగుల్స్ ధరించి రెండు చేతులతో థంబ్స్ అప్ సింబల్ ఇచ్చింది.

మరోవైపు సారా మాత్రం అదే రకం స్కర్టుకు మ్యాచింగ్ గా లైట్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి పోజిచ్చింది. అయితే ఈ టాప్ కు స్కర్ట్ డిజైన్ లోనే ఒక ముడి ఉంది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్.. మెడలో చెయిన్.. చేతికి ఒక బ్యాంగిల్ తో స్టైలింగ్ పూర్తి చేసింది. కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఫ్యాషన్ పరంగా చూస్తే మాత్రం సారాకు కొద్దిగా ఎక్కువ మార్కులు ఇవ్వాలని ఎక్కువమంది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.. హెయిర్ స్టైలింగ్.. గాగుల్స్ కూడా కియారా కంటే కాస్త బెటర్ గా ఉందని వారి వెర్షన్. అయితే కియారానే సూపర్ అని సహజంగా ఉందని.. సారా స్టైల్ కృత్రిమంగా ఉందని మరి కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా ఉందో.. మీకేమనిపిస్తోందో చెప్పండి.
Please Read Disclaimer