భామ మేకప్ తేడా కొట్టిందే!

0

బాలీవుడ్ లో చాలామంది హాటీలు ఉన్నారు కానీ వారిలో క్రేజీ బ్యూటీలు తక్కువే. అలాంటి క్రేజీ భామ కియారా అద్వాని. వరస హిట్లతో దూసుకుపోతూ హాటు ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. కియారా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్సులు.. మోడరన్ డ్రెస్సులు.. చిట్టిపొట్టి జిమ్ము డ్రెస్సులు.. ఫ్యాషన్ ఈవెంట్స్ లో డిజైనర్ డ్రెస్సులు ధరించి జనాల మనసులను కల్లోలభరితం చెయ్యగలదు.

ఫ్యాషన్ డిజాస్టర్ అనే పదం సహజంగా కియారా విషయంలో చూడలేం. అంతే కాదు.. మేకప్ కూడా ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ తాజాగా కియారా మేకప్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఈమధ్య కియారా ముంబైలో ఒక చోట కనిపించింది. అసలే క్రేజీ బ్యూటీ కావడంతో ఫోటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీసి రజనీకాంత్ లాగా లకలకమంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పెట్టారు ఈ ఫోటోలలో కియారా డ్రెస్ సూపర్ గానే ఉంది కానీ ఫేస్ మాత్రం అదోలా ఉంది. లిప్ స్టిక్.. ఐ బ్రోస్ ఎక్కడో ఏదో తేడా కొట్టిందని ఫేస్ అదోలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘భూల్ భులయ్యా 2’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా సౌత్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయట. అయితే బిజీగా ఉన్నకారణంగా కియారా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తోందట
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-