కియరా .. ఏంటీ రాంగ్ ఛాయిస్?

0

గత కొంతకాలంగా కియరా పేరు నిరంతరం హెడ్ లైన్స్ లో వినిపిస్తోంది. ఓవైపు కెరీర్ బిజీ.. వరుస సినిమాలతో హడావుడి.. మరోవైపు ముంబై ర్యాంపుపై జోరు.. వరుస ఫోటోషూట్లు.. కమర్షియల్ ప్రకటనలు వగైరా వగైరా కారణాలతో కియరా పేరు మార్మోగిపోతోంది. కెరీర్ ప్రారంభించిన కేవలం నాలుగైదేళ్లలోనే అగ్ర హీరోల సరసన టాప్ రేంజ్ అవకాశాలు అందుకుంటూ ఇతర నాయికలకు ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.

2019 కియరాకి అన్నిరకాలుగా కలిసొచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ హిట్ కబీర్ సింగ్ తో కియరా పేరు మార్మోగిపోయింది. ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కిలాడీ అక్షయ్ సరసన ఒకేసారి రెండు సినిమాలు చేస్తోంది. లక్ష్మి బాంబ్ (అక్షయ్)- గుడ్ న్యూస్ (అక్షయ్) రెండిటిలో అక్షయ్ కథానాయకుడు. అలాగే ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో కియరా క్షణం తీరిక లేకుండా ఉంది.

ఇక మరోవైపు ముంబై ఫ్యాషన్ ఈవెంట్లతోనూ అంతే వేడెక్కిస్తోంది. తాజా ఈవెంట్ లో కియరా లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. అయితే ప్రతిసారీ కుదిరినట్టు ఈసారి కియరాకి ఏదీ కుదరలేదు. ఫ్యాషన్ మిస్ ఫైర్ అయ్యింది. ఆల్మోస్ట్ పింక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో కనిపించిన కియరాలో ఏదో మిస్సయ్యిందని పర్ఫెక్ట్ గా ఆ డిజైన్స్ లేవని చూస్తుంటేనే తెలిసిపోతోంది. క్లోజప్ షాట్స్ లో మేకప్ తక్కువగా ఉన్న ఫోటోలు ఆకట్టుకున్నా.. డ్రెస్ కలర్ గ్రేడింగ్.. డిజైన్స్ నిరాశపరిచాయి. కియరా ఇంతకంటే స్టన్నింగ్ గెటప్పుల్లో చాలాసార్లు కనిపించడంతో అభిమానుల్ని ఈ కొత్త లుక్ అంతగా సంతృప్తి పరిచలేదు.
Please Read Disclaimer