కియారా.. క్వీన్ ఆఫ్ హార్ట్స్

0

బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ వారిలో కొందరే తెలుగు సినిమాల్లో నటిస్తారు. ప్రేక్షకుల ఆదరణ చూరగొంటారు. కియారా అద్వాని అలానే బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి మధ్యలో రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పుడేమో హిందీ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫోటో షూట్లు చెయ్యడం మాత్రం అసలు మానడం లేదు.

తాజాగా ఈ భామ బ్రైడ్స్ టుడే యానివర్సరీ ఎడిషన్లో మెరిసింది. లైట్ డిజైనర్ గౌన్లో కియారా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజిచ్చింది. డ్రెస్సుకు తగ్గట్టుగా ఆభరణాలు ధరించి వెరైటీ హెయిర్ స్టైల్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పెళ్లికూతురు లాగా ఫోటో షూట్ కాబట్టి ఒక యువరాణి తరహాలో నవ్వుతూ పోజిచ్చింది. ఈ ఫిబ్రవరి ఎడిషన్లో కియారా అద్వాని పై “కియారా అద్వాని-క్వీన్ ఆఫ్ హార్ట్స్” అంటూ ఓక కథనం కూడా ప్రచురించారు. టైటిల్ మాత్రం సూపర్ గా ఉంది కదా. హృదయాలకు రాణి అనే అనువాదం చేసుకోవాలి.

ఈ ఫోటోకు ఇన్స్టాలో భారీ స్పందన దక్కింది. “ఏక్ దమ్ ఝకాస్”.. “బ్యూటిఫుల్ బ్రైడ్”.. “ప్రీతి సో క్యూట్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘భూల్ భులయ్యా 2’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ ఆమె లిస్టు లో ఉన్న సినిమాలు.
Please Read Disclaimer