గ్రే హెయిర్ కియరా మోనాలిసా

0

సరైన టైమ్ లో సరైన హిట్టు పడితే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అలాంటి హిట్టే అందుకుంది కియరా అద్వాణీ. 2019 బాలీవుడ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. సల్మాన్- కత్రిన నటించిన `భారత్` ని మించి షాహిద్- కియరా నటించిన `కబీర్ సింగ్` కలెక్ట్ చేసింది. బాలీవుడ్ టాప్ 10 సినిమాల జాబితాలోకి చేరింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ లో నటించాక చెప్పేదం ఉంది? అసలే కియరా స్పీడ్ మామూలుగా లేదు. నిరంతరం ఏదో ఒక సెన్సేషన్ తో అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో టచ్ లో ఉంటోంది.

దీపం ఉండగానే కాస్తంత చక్కదిద్దుకునే పనిలోనూ ఉంది. కియరా ఇప్పటికిప్పుడు పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుత స్టార్ డమ్ ని పదింతలు చేసేందుకు పథకం రచిస్తోంది. కెరీర్ పరంగా తెలివైన ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది. అభిమానుల నుంచి దూరం కాకుండా నిరంతరం ఫోటోషూట్లతోనూ అంతే వేడి పెంచుతోంది. తాజాగా రివీల్ చేసిన ఫోటోషూట్ లో కియరా గ్రే హెయిర్ లుక్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. బూడిద వర్ణం హెయిర్ .. హాట్ క్లీవేజ్ షోతో యూత్ కి మతి చెడగొడుతోంది కియరా. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూడగానే ఎవరీ గ్రే హెయిర్ మోనాలిసా అంటూ ఫ్యాన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.

ఇదే హుషారులో అటు బాలీవుడ్ లో నటిస్తూనే తమిళంలోనూ ఓ భారీ చిత్రానికి సంతకం చేసిందట. ఇలయదళపతి విజయ్ నటించనున్న 64వ చిత్రంలో కియరానే కథానాయికగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అట్లీతో సినిమా పూర్తవ్వగానే విజయ్ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home