లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే నో చెప్పిన కియారా

0

కియారా అద్వానీ…ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హోదా సొంతం చేసుకుని వచ్చే ఏడాది దాకా చేతి నిండా సినిమాలతో వెలిగిపోనున్న హీరోయిన్. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ భామ. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘గిల్టీ’ ద్వారా అందరూ మరోసారి తనవైపు చూపు తిప్పుకొనేలా చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ బాట పట్టింది ఈ ‘ధోనీ’ భామ. తొలి చిత్రంతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. మొదటి సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమా పరాజయం పాలైన కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. కెరీర్ ప్రారంభం నుండి మంచి కథా బలమున్న చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని పొందింది కియారా. అయితే తనకు లైఫ్ ఇచ్చిన కరణ్ జోహార్ ఇప్పుడు ఈమెపై కోపంగా ఉన్నాడట.

వివరాల్లోకి వెళ్తే కరణ్ జోహార్ తన సొంత నిర్మాణ సంస్థఐన ధర్మ ప్రొడక్షన్ హౌస్ లో ‘మిస్టర్ లేలే’ అనే హిందీ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకున్న కరణ్ జోహార్ ఆమెతో సంప్రదింపులు జరిపారంట. ప్రస్తుతం ఆమె ఉన్న బిజీలో ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేనని సున్నితంగా తిరస్కరించిందంట. లైఫ్ ఇచ్చిన తనకే డేట్స్ ఇవ్వడం లేదని కరణ్ జోహార్ గుస్సా అవుతున్నాడని బీటౌన్ జనాలు చెప్పుకుంటున్నారు. కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాతను అప్సెట్ చేసిన కియారా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-